Summer Health Tips: వేసవి కాలం అంటేనే అందరు బయపడుతుంటారు. వేసవికాలంలో ఎండ ఎక్కువగా కొడుతుంది, అత్యంత వేడి కలిగిన కాలం అని. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. వేసవిలో వడదెబ్బ తగలకుండా, చర్మ సమస్యలు మరియు జీర్ణసమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
నీరు ఎక్కువగా త్రాగండి:
వేసవిలో శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే రోజుకు 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. దాహం వేయడం లేదని నీరు త్రాగకుండా ఉంటే శరీరం డీహైడ్రేట్ అవుతుంది, దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కావున దాహం వేసిన, వేయకపోయినా నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు నీరు ఎక్కువగా తీసుకోవాలి. నీటికి బదులు కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలు కూడా తీసుకోవచ్చు.
పండ్లు, కూరగాయలు తినండి:
వేసవిలో శరీరానికి తగినంత పోషకాలు అందించడానికి పొడి ఆహారాలు, పండ్లు, కూరగాయలు తినడం మంచిది. పుచ్చకాయ, దోసకాయ, నారింజ, నిమ్మకాయ వంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయంటున్నారు. కీరదోస, టమాటా, క్యారెట్ వంటి కూరగాయలు కూడా వేసవిలో తీసుకోవడానికి చాలా మంచివని సూచిస్తున్నారు.
బయటి ఆహారం తగ్గించాలి:
వేసవిలో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి మరియు పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వేడి చేస్తాయి, ఆరోగ్యానికి హాని చేస్తాయి. బరువు కూడా ఎక్కువగా పెరుగుతారు.
బయటకి వెళ్ళడం తగ్గించాలి:
మధ్యహ్నం వేళ ఎండ చాలా వేడిగా ఉంటుంది, కాబట్టి ఆ సమయంలో బయటకు వెళ్లడం తగ్గించాలి.. అత్యవసర సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే శరీరం చల్లబడేలా చూసుకోవడం ముఖ్యం. చల్లటి నీటితో స్నానం చేయండి. వీలైనంత వరకు ఉదయం, సాయంత్రం రెండు పూటల స్నానం చేయడం మంచిది. ఎండలో బయటకు వెళ్ళే ముందు సన్ స్ర్కీన్ తప్పని సరిగా వాడటం అలవాటు చేసుకోండి. దీని వల్ల ఎండ ప్రభావం శరీరం పై ఎక్కువగా పడదు చర్మానికి ఎక్కువగ హాని జరగదంటున్నారు.
ఇంట్లో తయారుచేసిన ఆహారం:
బయటి నుంచి తెచ్చకున్న ఆహారం కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బయటి ఆహారాల్లో కలుషిత పదార్థాలు ఉండవచ్చు మరియు అవి అనారోగ్యానికి గురి చేస్తుంది. అలాగే ఎలక్ట్రోలైట్ పానీయాలు త్రాగడం వల్ల శరీరంలోని నీటిశాతం తగ్గకుండా ఉంటుంది.
Also Read: మామిడి పండు ఇలా తిన్నారంటే.. జబర్దస్త్ ఉంటది
ఇతర జాగ్రత్తలు:
. ఎండకాలంలో సూర్యుడి వేడి ఎక్కువగా ఉండే సమయంలో బయటికి వెళ్ళడం తగ్గించండి.
. వదులుగా ఉండే తేలికపాటి మరియు లేత రంగుల దుస్తులు ధరించండి.
. మధ్యపానం మరియు స్మోకింగ్ తీసుకోవడం మానుకోవాలి.
. వేసవిలో చల్లటి ప్రదేశాలలో ఉండటానికి ప్రయత్నించండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.