BigTV English

Rinku Singh : ‘టీమ్ ఇండియాలో నయా యువరాజ్ సింగ్ వచ్చాడు’

Rinku Singh : టీమ్ ఇండియాలోకి నయా యువరాజ్ సింగ్ వచ్చాడని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇంతకీ ఎవరి గురించని అనుకుంటున్నారా? ఇంకెవరో కాదండీ..యువ కెరటం రింకూ సింగ్. తన ఆటతీరుతో అందరినీ మైమరిపిస్తున్నాడు. అందుకే రోజురోజుకి తనకి ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోతున్నారు.

Rinku Singh :   ‘టీమ్ ఇండియాలో నయా యువరాజ్ సింగ్ వచ్చాడు’

Rinku Singh : టీమ్ ఇండియాలోకి నయా యువరాజ్ సింగ్ వచ్చాడని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇంతకీ ఎవరి గురించని అనుకుంటున్నారా? ఇంకెవరో కాదండీ..యువ కెరటం రింకూ సింగ్. తన ఆటతీరుతో అందరినీ మైమరిపిస్తున్నాడు. అందుకే రోజురోజుకి తనకి ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోతున్నారు. అలాంటి వారిలో లెజెండరీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా సునీల్ గవాస్కర్ అయితే ఆకాశానికి ఎత్తి వదిలేస్తున్నాడు. తను రోజురోజుకి ఆట తీరుని మెరుగుపరుచుకుని ముందడుగు వేస్తున్నాడని కితాబునిచ్చారు.ఇప్పటివరకు ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడని అన్నారు.


‘రింకూ క్రికెట్‌లో ఉన్న అన్ని షాట్లు అలవోకగా కొడుతున్నాడు. ఒక్క ఫ్రంట్ ఫుట్‌ మీదే కాదు, బ్యాక్ ఫుట్‌పై కూడా ఫ్రీగా ఆడేస్తున్నాడు. అలాగే స్టేడియంలో అద్దాలు బద్దలయ్యేలా భారీ షాట్లు ఆడుతున్నాడని తెలిపాడు. లెగ్ సైడ్, ఆఫ్ సైడ్ అదీ ఇదని కాదు, ఏది పడితే అది, ఎలా పడితే అలా ఇరగ్గొడుతున్నాడని సంతోషం వ్యక్తం చేశాడు. అయితే రింకూ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని అన్నాడు.ఒక్కసారి రింకూ సింగ్ క్రీజులో కుదురుకున్నాడంటే, అతన్ని ఆపడం ఎవరి తరం కాదని అన్నాడు.

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ 20లో 39 బాల్స్ లో 68 పరుగులు చేసిన విధానం అద్భుతమన్నాడు, ఎవరెన్ని ప్రశంసలు కురిపిస్తున్నా రింకూ సింగ్ మాత్రం, ఆ పొగడ్తల బుట్టలో పడటం లేదు. అందరికీ వినమ్రతగానే సమాధానమిస్తున్నాడు. ఇందులో తన గొప్పతనం ఏమీ లేదని చెప్పాడు. ముఖ్యంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన బ్యాటింగ్ స్టయిల్ మార్చాడని తెలిపాడు. ఒకసారి ఇలా ఆడి చూడమని సలహా ఇచ్చి, నెట్ లో ప్రాక్టీస్ చేయించాడని తెలిపాడు. తన బలం ఎటాకింగ్ ప్లే అని తెలిపాడు. దానిని ధోనీ, రైనా ఇద్దరూ ఐపీఎల్ లో మెరుగులు దిద్దారని తెలిపాడు. బ్యాట్ పట్టుకోవడంలో, క్రీజులో నిలబడటం, బెండింగ్ అన్ని పక్కా స్కేల్ ప్రకారం చెప్పారని అన్నాడు.నా సహజమైన ఆటని అలాగే ఆడమని చెబుతూనే వారు సూచనలు చేశారని అన్నాడు. దీంతోనే సక్సెస్ అవుతున్నానని అన్నాడు. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ తన ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేయర్స్ అని తెలిపాడు.రింకూ సింగ్ లో మంచి లక్షణాలున్నాయి, క్రికెట్ పెద్దల పట్ల గౌరవం ఉంది, త్వరలోనే టీమ్ ఇండియాలో సురక్షిత స్థానానికి చేరుకుంటాడని అప్పుడే చాలామంది జోస్యం చెబుతున్నారు.


Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×