BigTV English

Sunil Gavaskar : మళ్లీ వర్కౌట్ అయిన గవాస్కర్ ‘లక్కీ జాకెట్’ సెంటిమెంట్..!

Sunil Gavaskar : మళ్లీ వర్కౌట్ అయిన గవాస్కర్ ‘లక్కీ జాకెట్’ సెంటిమెంట్..!

Sunil Gavaskar : సాధారణంగా కొన్ని సందర్భాల్లో లక్ అనేది మన వెంటే ఉంటుంది. మనం ఒక పనిని ఎంత చేయవద్దు అనుకున్నా.. అది ఆటోమేటిక్ గా చేస్తుంటాం. అది వ్యక్తిగతంగా అయినా.. ఆటలో అయినా చాలా మందికి లక్ కలిసి వస్తుంటుంది. తాజాగా టీమిండియా కి కూడా అలాంటి లక్ కలిసి వచ్చిందనే చెప్పాలి.  ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్టు  లో టీమ్ ఇండియా  అద్భుత విజయం సాధించింది. చివరి రోజు ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. 28 రన్స్ చేసి ఆల్ అవుట్ అయింది. ఆఖరి రోజు సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టి భారత్ కు మరుపురాని విజయాన్ని అందించాడు. చివర్లో ఇంగ్లాండ్ గెలిపించేందుకు ప్రయత్నించిన అట్కిన్సన్ ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్  ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో కామెంట్రీ బాక్స్ లో ఉన్న భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆనందంలో మునిగితేలారు. సీటు లో నుంచి లేచి చప్పట్లు కొడుతూ భారత ఆటగాళ్లను అభినందించాడు.


Also Read : Team India : 77 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన టీమిండియా.. భారత్ ఖాతాలో మరో రికార్డు..!

కలిసొచ్చిన  గవాస్కర్ జాకెట్ 


ఈ మ్యాచ్ నాలుగు, ఐదో రోజు ఆట సందర్భంగా గవాస్కర్ తన లక్కీ జాకెట్ ధరించారు. 2021లో గబ్బాలో జరిగిన మ్యాచ్ లో కూడా సన్నీ ఇదే జాకెట్ వేసుకున్నారు. ఆ మ్యాచ్ లో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా.. 2-1తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సైతం కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఆ తెల్ల కోటును తన లక్కీ జాకెట్ గా భావిస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో ఐదో టెస్టులో భారత్ గెలవాలని ఆకాంక్షిస్తూ మరోసారి లక్కీ జాకెట్ ను ధరించారు. దీంతో గవాస్కర్ లక్కీ జాకెట్ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయినట్లుంది. ఐదో టెస్టులో మూడో రోజు ఆట ముగిసిన తర్వాత గవాస్కర్, శుభమన్ గిల్ తో మాట్లాడాడు. భారత్ ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను 2-2తో ముగించాలని ఆకాంక్షిస్తూ తన లక్కే జాకెట్ ను మళ్లీ బయటకు తీసుకు వస్తున్నానని చెప్పారు. రేపు నేను నా లక్కీ జాకెట్ ను ధరించబోతున్నానని చెప్పుకొచ్చాడు.

ఇంగ్లాండ్ ను దెబ్బతీసిన సిరాజ్ 

గతంలో ఆస్ట్రేలియాలో గబ్బా టెస్టులో ఆ కోటును ధరించాను. విజయాల కోసమే అది నాకు దొరికింది. ఆల్ ది బెస్ట్ అని గిల్ తో సునీల్ గవాస్కర్ చెప్పాడు. ఇవాళ సిరాజ్ మూడు వికెట్లు తీసి టీమిండియాకి అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఒకవైపు టీమిండియా ఓడిపోతుందనే ఉత్కంఠ.. మరోవైపు ఇంగ్లాండ్ చివరి బ్యాట్స్ మెన్ క్రిస్ వోక్స్ చూసి అభిమానులు ఫిదా అవ్వడం విశేషం. ఒంటి చేతితోనే గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు వోక్స్. అయితే వోక్స్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేదు. తన భుజానికి గాయం కావడంతో..  పరిస్తితి బాగాలేకపోవడంతో ఈ మ్యాచ్ మధ్యలోనే వెనుదిరిగాడు. తప్పని పరిస్థితిలో ఇవాళ మ్యాచ్ ఆడాడు. వోక్స్ బ్యాటింగ్ చేసి.. టీమిండియా ఓటమి పాలైతే మాత్రం పరిస్థితి మరోలా ఉండేది. వాషింగ్టన్ టీమిండియా బ్యాటర్లలో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని చివరి వికెట్ గా వెనుదిరిగాడు. వాషింగ్టన్ హాఫ్ సెంచరీతోనే టీమిండియా 396 పరుగులు చేయగలిగింది. లేదంటే టీమిండియా ఓటమి పాలయ్యేది. మొత్తానికి టీమిండియాకి లక్ కలిసి వచ్చి విజయం వరించింది.

Related News

SL Vs BAN : శ్రీలంక కి షాక్.. సూప‌ర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజ‌యం

Smriti Mandhana : విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్మృతి మంధాన..

SL Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తొలుత బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : ఫాస్టెస్ట్ సెంచరీ.. రికార్డు సృష్టించిన మంధాన

Abhishek Sharma : టీమిండియాలో మరో జయసూర్య.. వీడు కొడితే నరకమే

Asia Cup 2025 : టీమిండియా నుంచి గిల్ ను తొలగించండి… ఆడుకుంటున్న ఫ్యాన్స్

Ind vs aus : కొత్త జెర్సీలో టీమిండియా..రెచ్చిపోయిన ఆసీస్‌.. తొలిసారిగా 400పైగా స్కోర్

Suryakumar Yadav : వాడి వ‌ల్లే ఒమ‌న్ పై బ్యాటింగ్ చేయ‌లేక‌పోయాను..సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన సూర్య కుమార్‌

Big Stories

×