హైదరాబాద్ లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భవనం పైకప్పు కూలడంతో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఘటన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సమాచారం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.