BigTV English

Team India : 77 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన టీమిండియా.. భారత్ ఖాతాలో మరో రికార్డు..!

Team India :  77 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన టీమిండియా.. భారత్ ఖాతాలో మరో రికార్డు..!

Team India :  భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనను అద్భుతంగా ముగించింది. ఓవల్ వేదిక లో జరిగిన ఐదో చివరి టెస్టులో కేవలం 6 పరుగుల తేడాతో త్రిల్లింగ్ విజయం సాధించింది. ఒకానొక సమయంలో ఇంగ్లాండ్ గెలుపు దాదాపు ఖాయం అనిపించింది. కానీ భారత బౌలర్లు అద్భుతమైన పోరాట పటిమను చూపించి.. సిరీస్ ను 2-2 తేడాతో సమం చేశారు. ఈ విజయం సిరీస్ ను గుర్తుండిపోయేలా చేయడమే కాకుండా 77 ఏళ్లుగా కొనసాగుతున్న ఒక సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో చివరి మ్యాచ్ ను విదేశీ గడ్డపై గెలవడం భారత జట్టు చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.


Also Read : Siraj-Kohli : ఒకరిపై మరొకరు ప్రశంసలు.. థాంక్యూ భయ్యా అంటూ..!

మ్యాచ్ ను మార్చేసిన బౌలర్లు 


ఇక  అంతకుముందు విదేశాల్లో భారత్ 16 సార్లు ఐదు టెస్టుల సిరీస్ ఆడింది. కానీ చివరి టెస్టులో విజయం సాధించలేపోయింది. ఈసారి టెస్ట్ లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. ఓవల్ లో జరిగిన ఈ నిర్ణయాత్మక మ్యాచ్ లో భారత బౌలర్లు, బ్యాట్స్ మెన్ల మధ్య అద్భుతమైన సమన్యయం కనిపించింది. మ్యాచ్ చివరి క్షణాల్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. ఇంగ్లాండ్ కు గెలవడానికి కేవలం 35 పరుగులు అవసరం వారి చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. కానీ చివరి రోజు మొదటి సెషన్ లో భారత బౌలర్లు మ్యాచ్ ను పూర్తిగా మార్చేశారు. మహమ్మద్ సిరాజ్ చివరి 4 వికెట్లలో మూడు వికెట్లు తీయగా, ఒక వికెట్ ప్రసిద్ధ్ కృష్ణకు లభించింది. ఈ మ్యాచ్ లో సిరాజ్ మొత్తం తొమ్మిది వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 8 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

భారత్ మరో రికార్డు.. 

ఈ మ్యాచ్ తో భారత జట్టు మరో రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకుంది. విదేశాల్లో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 1- 2తో వెనకబడిన తర్వాత.. మళ్లీ పుంజుకుని సిరీస్ ను 2-2తో సమం చేయడం భారత జట్టు చరిత్రలో ఇదే మొదటిసారి. అంతేకాదు.. టెస్ట్ క్రికెట్ లో అత్యంత తక్కువ పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం.  ఇది కేవలం ఆటగాళ్ల విజయం మాత్రమే కాదు. భారత క్రికెట్ భవిష్యత్తుకు కూడా ఒక బలమైన పునాది వేసింది అనే చెప్పాలి. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయం సాధించింది. అలాగే టీమిండియా బ్యాటింగ్ లో వాషింగ్టన్ సుందర్ కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. తక్కువ బంతుల్లో హాప్ సెంచరీ సాధించి.. 396 స్కోర్ సాధించడంలో ఆయన మెరుపు ఇన్నింగ్స్ కారణం. లేదంటే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలయ్యేది. టీమిండియా విజయం సాధించడంలో ఆల్ రౌండర్లు కీలక పాత్ర పోషించారు. అలాగే బౌలర్లు కూడా.. బ్యాటింగ్ లో జైస్వాల్ సెంచరీ జట్టుకు కీలకమే. మొత్తానికి ఈ టెస్ట్ సిరీస్ కోల్పోకుండా టీమిండియా 2-2 తో సమం చేసుకోవడం గొప్ప విషయం అనే చెప్పాలి.

Related News

SL Vs BAN : శ్రీలంక కి షాక్.. సూప‌ర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజ‌యం

Smriti Mandhana : విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్మృతి మంధాన..

SL Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తొలుత బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : ఫాస్టెస్ట్ సెంచరీ.. రికార్డు సృష్టించిన మంధాన

Abhishek Sharma : టీమిండియాలో మరో జయసూర్య.. వీడు కొడితే నరకమే

Asia Cup 2025 : టీమిండియా నుంచి గిల్ ను తొలగించండి… ఆడుకుంటున్న ఫ్యాన్స్

Ind vs aus : కొత్త జెర్సీలో టీమిండియా..రెచ్చిపోయిన ఆసీస్‌.. తొలిసారిగా 400పైగా స్కోర్

Suryakumar Yadav : వాడి వ‌ల్లే ఒమ‌న్ పై బ్యాటింగ్ చేయ‌లేక‌పోయాను..సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన సూర్య కుమార్‌

Big Stories

×