BigTV English

Rapido Driver Viral Video: ర్యాపిడో బుక్ చేసుకొని.. బైక్ నెట్టించాడు.. ఐడియా బలే ఉందే!

Rapido Driver Viral Video: ర్యాపిడో బుక్ చేసుకొని.. బైక్ నెట్టించాడు.. ఐడియా బలే ఉందే!
Rapido Driver Viral Video
Rapido Driver Viral Video

Rapido Driver Viral Video: దేశంలోని ప్రధాన నగరాల్లో ర్యాపిడోకు చాలా క్రేజ్ ఉంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాలేజీ స్టూడెంట్స్‌తో మొదలు పెడితే.. జాబ్ హోల్డర్స్‌ వరకు ప్రతి ఒక్కరూ ర్యాపిడో సేవలను ఉపయోగించుకుంటారు. ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే ర్యాపిడో డ్రైవర్లు సమయానికి గమ్య స్థానానికి చేరవేస్తారు. ట్రిప్ కూడా చాలా తక్కువ ప్రైజ్‌లో లభిస్తుంది. టైమ్ కూడా సేవ్ కావడంతో ర్యాపిడో బుక్ చేసుకుంటున్నారు. కస్టమర్ల సేఫ్టీ విషయంలోనూ ర్యాపిడో రాజీపడదు.


అయితే తాజా ర్యాపిడో డ్రైవర్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇంటర్నెట్‌లో ఈ వీడియో సంచలనంగా మారింది. ఆ ర్యాపిడో డ్రైవర్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ర్యాపిడో డ్రైవర్‌ చేసిన పనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ కథేంటో మీరు చూడండి.

Read More: కొడితే.. గూబ గుయ్ అంది.. వైరల్ వీడియో!

మనం చెప్పుకునే ర్యాపిడో డ్రైవర్‌కు ఓ బుకింగ్ వస్తుంది. దీంతో అతడు బుకింగ్ యాక్సెప్ట్ చేసి లోకేషన్‌కు వెళ్తాడు. అక్కడకు వెళ్లగానే కస్టమర్ బైక్‌తో ఉంటాడు. ఈ సీన్ చూసిన ర్యాపిడో డ్రైవర్ ఒక్కసారిగా షాకవుతాడు. బుకింగ్ చేసి బైక్‌తో ఉన్నాడు? ఏంటబ్బా ఇదని అనుకుంటూ ఉంటాడు.

ఇక ఆలస్యం చేయకుండా కస్ట‌మర్ దగ్గరకి వెళితే అసలు మ్యాటర్ బయటబడుతుంది. అదేంటంటే ఆ కస్టమర్ బైక్‌లో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోతే ర్యాపిడో ఎందుకు బుక్ చేశాడని అనుకుంటున్నారు కదా. ర్యాపిడో డ్రైవర్ కూడా ఇదే అనుకొని ఉంటాడు.

కానీ ఆ కస్టమర్ బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో చాలా తెలివిగా వ్యవహరించాడు. పెట్రోల్ బంకులు కోసం వెతుకుతూ టైమ్ వేస్ట్ చేయకుండా, బైక్‌ను తోసుకుంటూ వెళ్లకుండా ర్యాపిడో డ్రైవర్‌తో తను వెళ్లాల్సిన లొకేషన్ వరకు బైక్ తోయించుకున్నాడు. అందుకు గానూ రైడ్ అమౌంట్ పే చేశాడు.

Read More: వామ్మో.. పార్కింగ్ ఫీజు గంటకు రూ. వెయ్యా..!

ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. బుక్ చేసినప్పుడు ఆ డ్రైవర్‌కు కాల్ చేసి పెట్రోల్ తెప్పించుకోవచ్చుగా అని కామెంట్ చేశారు. అసలు ఆ డ్రైవర్ కామెరా ఎందుకు పెట్టుకొచ్చాడని మరొకరు కామెంట్ చేశారు. ఇదంతా పెద్ద ఫ్రాడ్ అని మరొకరు అన్నారు. ఇదంతా ర్యాపిడో పబ్లిసీటి స్టంట్ అని విమర్శిస్తున్నారు.

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×