BigTV English

Sunrisers Hyderabad Vs Mumbai Indians: ఉప్పల్ లో రికార్డుల ఉప్పెన..

Sunrisers Hyderabad Vs Mumbai Indians: ఉప్పల్ లో రికార్డుల ఉప్పెన..
SRH vs MI match highlights
SRH vs MI match highlights(Sports news in telugu): హైదరాబాద్ వర్సెస్ ముంబై మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. ఉప్పల్ స్టేడియంలో పరుగుల ఉప్పెన వచ్చింది. ఒకటి రెండు కాదు…ప్రతీది రికార్డుగానే చెబుతున్నారు. అందులో మొట్టమొదటిది ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారి 20 ఓవర్లలో 277 పరుగులు చేయడం ఒక సరికొత్త రికార్డ్ గా నిలిచింది. హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 523 పరుగులు చేశాయి. టీ20 చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో ఇన్ని పరుగులు నమోదవ్వడం ఇదే తొలిసారి.
ఐపీఎల్ అంటేనే సిక్సర్లకు ప్రసిద్ధి. అలాంటిది ఇంతటి హై ఓల్టేజ్ మ్యాచ్ లో నమోదైన సిక్సర్లు ఎన్నంటే 38.  పురుషుల టీ20 క్రికెట్‌లో ఇది ఆల్‌టైమ్ రికార్డు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌గా చరిత్రకెక్కింది. ఓడిపోయినా రెండు సిక్సులు ఎక్కువే కొట్టిన ముంబై ఇండియన్స్ 20 సిక్సర్లు కొడితే.. గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం 18 సిక్స్‌లు కొట్టింది.

 


Also Read: విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమాని.. చితక్కొట్టిన సెక్యూరిటీ గార్డులు..

18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన ట్రావిస్ హెడ్.. సన్‌రైజర్స్ తరఫున అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62 పరుగులు చేసి విధ్వంసం చేశాడు.


ఇదే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి ఐపీఎల్ లో అతి తక్కువ బాల్స్ లో ఆఫ్ సెంచరీ చేసిన వీరుడిగా రికార్డులకెక్కాడు.

ఈ ఇద్దరూ ఒకేసారి సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డును అధిగమించారు. గతంలో డేవిడ్ వార్నర్.. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం విశేషం.

అంతేకాదు సన్ రైజర్స్ మరో రికార్డు కూడా సాధించింది. మ్యాచ్ 10 ఓవర్ల తర్వాత అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఘనత సాధించింది. 60 బాల్స్ లో 2 వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. అయితే ముంబై ఇండియన్స్ కూడా తక్కువ తినలేదు. వాళ్లు కూడా 10 ఓవర్ల తర్వాత 60 బాల్స్ లో 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.

అంతకుముందు ఇలాంటి రికార్డు ఒకటి ముంబై ఇండియన్స్ పేరిట ఉంది. కాకపోతే వాళ్లు తొలి 10 ఓవర్స్ లో 3 వికెట్లు నష్టపోయి 138 పరుగులు చేశారు. ఇదండీ సంగతి…

దుమ్ము దుమారం రేగిన హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ విశేషాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

Related News

Rahkeem Cornwall Helmet: జ‌స్ట్ మిస్‌… బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతి…హెల్మెట్ లో ఇరుక్కుని మ‌రి..!

Smriti Mandhana: స్మృతి మందాన 28 ఏళ్ల‌ చ‌రికొత్త రికార్డు..1000 ప‌రుగులు క్రాస్, ఆసీస్ పై భారీ స్కోర్‌

Ind vs WI: 5 వికెట్ల‌తో చెల‌రేగిన‌ కుల్దీప్…మొద‌టి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్‌..స్కోర్ వివ‌రాలు ఇవే

Mahika Sharma: 13 ఏళ్లలోనే షాహిద్ ఆఫ్రీదితో ఎ**ఫైర్‌.. బ‌య‌ట‌ప‌డ్డ‌ పాండ్యా కొత్త ల‌వ‌ర్ భాగోతం !

INDW vs AUSW: ఇవాళ ఆసీస్ తో బిగ్ ఫైట్‌..ఓడితే టీమిండియా ఇంటికేనా? పాయింట్ల ప‌ట్టిక ఇదే

Sai Sudharsan Catch: సాయి సుద‌ర్శ‌న్ స‌న్నింగ్ క్యాచ్‌..చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..కానీ చివ‌ర‌కు

Roman Reigns vs Bronson reed: క్రికెట్ బ్యాట్ ప‌ట్టి చిత‌క‌బాదిన రోమన్ రీన్స్..బ‌లంగా బాదేసి మ‌రీ, కానీ చివ‌ర‌కు

Sa vs Nam: టీ20 చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం…దక్షిణాఫ్రికాపై నమీబియా సంచలన విజయం

Big Stories

×