Big Stories

Virat Kohli Fan Beaten by Security: విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమాని.. చితక్కొట్టిన సెక్యూరిటీ గార్డులు.. వీడియో వైరల్!

Virat Kohli Fan Moment

- Advertisement -

Virat Kohli Fan Beaten by Security: ఐపీఎల్ అంటేనే ఫుల్ జోష్ గా ఉంటుంది. అంతేకాదు తమ అభిమాన క్రికెటర్లు క్రీజులో ఉన్నప్పుడు వారి ఆనందం డబుల్ , త్రిబుల్ అవుతుంటుంది. ఆ ఉన్మాదపు ఆనందంలో ఏం చేస్తున్నారో వారికే తెలీదు. అంతే ఇంకేమీ చూసుకోరు. అడ్డొచ్చిన హార్డిల్స్ అన్నీ దాటేస్తారు. గ్రౌండ్ లోకి పరుగెడతారు.

- Advertisement -

పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య బెంగళూరు క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఇలాగే జరిగింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. 49 బంతుల్లో 77 పరుగులు చేశాడు. చివర్లో దినేశ్ కార్తీక్ 28, మహిపాల్ 17 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టుని గెలిపించారు.

విరాట్ విధ్వంసం సాగుతున్న సమయంలో ఒక అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. వెళ్లడం వెళ్లడం విరాట్ దగ్గరికి వెళ్లి అతని కాళ్లపై పడ్డాడు. ఈ హఠాత్పరిణామానికి షాక్ అయిన కోహ్లీ తేరుకున్నాడు. తను తప్పించుకోడానికి ప్రయత్నించే లోపు సెక్యురిటీ సిబ్బంది వచ్చి ఆ యువకుడ్ని అదుపులోనికి తీసుకున్నారు.

తర్వాత జరిగిన పరిణామమే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ కుర్రాడ్ని పట్టుకుని సెక్యూరిటీ సిబ్బంది చితక్కొట్టారు. మమూలుగా తన్నలేదు. కాలితో తన్నారు. ఎగిరి తన్నారు. పొట్టలో గుద్దారు. వారి బాక్సింగ్ నైపుణ్యమంతా ఆ కుర్రాడి మీద చూపించారు. ఇవన్నీ స్టేడియం కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇవి బయటకు రావడంతో ఒక్కసారి నెట్టిల్లు భగ్గుమంది.

Also Read: శుభ్‌మన్ గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా.. రిపీట్ అయితే ఒక మ్యాచ్ వేటు..

ఆ సెక్యురిటీ సిబ్బందిని తిట్టిపోస్తున్నారు. కొట్టే అధికారం మీకెవరిచ్చారు. నిజంగా ఆ యువకుడు తప్పు చేస్తే కేసు పెట్టాలి. పోలీసులకు అప్పగించాలి. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి గానీ, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఆ కుర్రాడు అనుమతి లేకుండా గ్రౌండ్ లోకి వెళ్లి తప్పు చేస్తే, మరి మీరు చేసిందేమిటి? మీకెవడిచ్చాడు మనుషుల్ని కొట్టే అధికారమని చాలా సీరియస్ గా, ఘాటుగానే వార్నింగులు ఇస్తున్నారు.

ఇప్పుడీ ఘటన నెట్టింట వైరల్ గా మారింది. అంత విచక్షణా రహితంగా కొట్టడం దారుణమని, అభిమానిపై చెయ్యి చేసుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News