SRH VS PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. 27వ మ్యాచ్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల ( Sunrisers Hyderabad vs Punjab Kings Teams) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో… మొదట సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బౌలింగ్ చేయబోతోంది. ఇవాల్టి పిచ్ మొదట బ్యాటింగ్ చేసిన వారికి మాత్రమే అనుకూలించే ఛాన్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టాస్ గెలిచి వెంటనే బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది పంజాబ్ కింగ్స్.
Also Read: Glenn Phillips: గుజరాత్ కు బిగ్ షాక్… డేంజర్ ప్లేయర్ అవుట్
మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జరిగే సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్.. జియో హాట్ స్టార్ లో మనం ఉచితంగానే చూడడానికి అవకాశం కల్పించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు అన్నీ కూడా ఉచితంగా చూడవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్లు వస్తాయి.
ఇవాళ ఓడితే ఇంటికే..
సన్రైజర్స్ హైదరాబాద్ మరో 9 మ్యాచులు ఆడాల్సి ఉంది. లీగ్ దశలో ఈ తొమ్మిది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్లు విజయం సాధిస్తే… ప్లే ఆఫ్ లోకి నేరుగా వెళుతుంది. ఒకవేళ… ఏడు మ్యాచ్ల్లో… ఒక్క మ్యాచ్ తగ్గినా కూడా హైదరాబాద్ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాల్టి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ హైదరాబాద్ జట్టు గెలవాల్సి ఉంటుంది. అయితే పంజాబ్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య గత రికార్డులు పరిశీలించినట్లయితే… SRH జట్టుకు మంచి రికార్డులు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ ఇవాళ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: Glenn Phillips: గుజరాత్ కు బిగ్ షాక్… డేంజర్ ప్లేయర్ అవుట్
పంజాబ్ కింగ్స్ VS సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల వివరాలు
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), శ్రేయాస్ అయ్యర్ (c), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (C), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగ