SRH VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్ లోనే 44 పరుగుల తేటతోతేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది సన్రైజర్స్ హైదరాబాద్. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన ఇవాల్టి మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టును చిత్తుచిత్తు చేసింది హైదరాబాద్. బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో అద్భుతంగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్.. సొంత గడ్డపై విక్టరీ కొట్టింది.
ఈ మ్యాచ్ లో… నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విధించిన లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు చేదించలేకపోయింది. సంజు సాంసన్, దృవ్ జురెల్ ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్ జట్టును గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ… వాళ్ళ ఆటలను సాగనివ్వలేదు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లు. ఇక ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బౌలింగ్ తీసుకుంది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. మొదట బ్యాటింగ్ తీసుకుంది.
ఇక ఇదే అదునుగా… మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో… ఆరు వికెట్లు నష్టపోయిన సన్రైజర్స్ హైదరాబాద్… ఏకంగా 286 పరుగులు చేసింది. గతంలో 287 పరుగులు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్…. ఈసారి మొదటి మ్యాచ్ లోనే 286 పరుగులు చేసింది.
హెడ్, ఇషాన్ కిషన్ బీభత్సం
ఇవాల్టి మ్యాచ్ లో ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ ఇద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ట్రావిస్ హెడ్ 67 పరుగులు చేయగా, అటు యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ సెంచరీ చేశాడు. దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో 6 వికెట్ నష్టపోయి 286 పరుగులు చేసింది హైదరాబాద్. అటు అభిషేక్ శర్మ 24 పరుగులు చేశాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 30 పరుగులు చేసి దుమ్ము లేపాడు. క్లాసెన్ చివర్లో 34 పరుగులతో రాణించాడు.అటు 287 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో…. రాజస్థాన్ రాయల్స్ జట్టు తేలిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టపోయిన రాజస్థాన్ రాయల్స్ 242 పరుగులు మాత్రమే చేసింది.
సంజు, జురెల్ పోరాటం వృధా
అయితే…. ఇవాల్టి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గెలిపించేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు సంజు శాంసన్. ఈ తరుణంలోనే…. 37 బంతుల్లో 66 పరుగులు సాధించాడు సంజు శాంసన్. ఇందులో నాలుగు సిక్సర్లు, ఏడు బౌండరీలు ఉన్నాయి. కానీ హర్షల్ పటేల్ బౌలింగ్లో… క్లాసెన్ కు గ్యాస్ ఇచ్చి అవుట్ అయ్యాడు సంజు. అటు.. రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ దృవ్ జురెల్ 35 బందులో 70 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు ఉన్నాయి.
చివర్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు హెట్ మేయర్ 42 పరుగులతో దుమ్ము లేపాడు. అటు దూబే కూడా రాణించాడు. కానీ చివర్లో ఆస్కింగ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్… ఓటమి పాలు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 44 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై సన్రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.