E-Paper
Advertisement

Virat Kohli : కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్..! టీమ్ ఇండియాను గెలిపించిన విరాట్ ఫీల్డింగ్..!

Virat Kohli : కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్..! టీమ్ ఇండియాను గెలిపించిన విరాట్ ఫీల్డింగ్..!
Advertisement
Virat Kohli latest news

Virat Kohli latest news(Sports news today):

ఆఫ్గాన్ తో జరిగిన టీ 20 మూడో మ్యాచ్ చరిత్రలో ఒకటిగా నిలిచిపోతుంది.  అంతర్జాతీయ టీ20ల్లో డబుల్ సూపర్ ఓవర్ ఆడటం ఇదే తొలిసారి. ఇంత థ్రిల్లింగ్ మ్యాచ్ లో టీమ్ ఇండియా గెలుపులో రోహిత్ శర్మ, రింకూసింగ్, రవి బిష్ణోయ.. ఈ ముగ్గురితో పాటు మరొకరున్నారు. తనే విరాట్ కోహ్లీ.

ఈ మ్యాచ్ లో విరాట్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు కదా.. మ్యాచ్ ను తనెలా గెలిపించాడని అనుకుంటున్నారా? అదేనండీ… ఆడితే బ్యాట్ తో, బాల్ తోనో కాదు, ఫీల్డింగ్ లో కూడా అద్భుతాలు చేయవచ్చునని కోహ్లీ మరోసారి నిరూపించాడు.

Advertisement

ఈ మ్యాచ్ లో కోహ్లీ లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేశాడు. 212 పరుగులు చేశాం కదాని.. ప్రశాంతంగా ఉండలేదు. యువకులకు స్ఫూర్తినిచ్చేలా గ్రౌండ్ లో పరుగెత్తాడు. కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో పాటు ఉసేన్ బోల్ట్ లా గ్రౌండ్ లో చిరుతలా పరుగెత్తి మరీ రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అంతేకాదు వేగంగా కదిలి కనీసం 15 పరుగుల వరకు సేవ్ చేశాడు. అందులో ఒక సిక్సర్ ను ఆపాడు. అలాగే బౌండరీలను ఆపాడు.

అప్పుడు 17 వ ఓవర్ నడుస్తోంది. ఆఫ్గానిస్తాన్ వీరోచితంగా పోరాడుతోంది. ఓవర్ ఓవర్ కి టీమ్ ఇండియాలో టెన్షన్ పెరిగిపోతోంది. అలా వాషింగ్టన్ సుందర్ వేసిన ఆ ఓవర్‌లో కరీమ్ జనత్  భారీ షాట్ కొట్టాడు. అది లాంగాన్ మీదుగా వెళుతోంది. అంతా సిక్స్ అనుకున్నారు.

Advertisement

కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్నది ఎవరు? విరాట్ కోహ్లీ.. తనేం చేశాడో తెలుసా? 58 మీటర్లు గాల్లోకి ఎగిరాడు. అలా గాల్లోనే బంతిని ఆపాడు. ఎందుకైనా మంచిదని, దాన్ని గ్రౌండ్ లోపలికి త్రో చేశాడు. అలా ఆపిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. చివరికి సిక్సర్ కాస్తా సింగిల్ గా మారింది.

తర్వాత 18 ఓవర్ లో మరో అద్భుతం జరిగింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో నజీబుల్లా జద్రాన్ ఒక భారీ సిక్సర్ కొట్టాడు. మళ్లీ చిరుతలా కొహ్లీ దాని వెంట పడ్డాడు. ఈసారి గ్రౌండ్ అవతలికి, దానిని వెళ్లనివ్వలేదు. అతి వేగంగా పరుగెడుతూనే ఆ క్యాచ్ ని రన్నింగ్ లో అందుకున్నాడు. అంతేకాదు ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా బౌండరీ లైను దగ్గర, కారు బ్రేక్ వేసినట్టు స్టడీగా నిలుచున్నాడు. ఇది క్రికెట్ చరిత్రలో ఒక స్టన్నింగ్ క్యాచ్ అని కొందరు కొనియాడుతున్నారు.

ప్రస్తుతం ఈ ఫీల్డింగ్ స్టంట్‌ సినిమాల్లో తెరమీద హీరో మాత్రమే చేయలడని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో  నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సిక్సర్‌ను, మరికొన్ని బౌండరీ లైను దగ్గర పరుగులను కోహ్లీ ఆపకపోయి ఉంటే మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కు దారి తీసేది కాదని అంటున్నారు.

అలాంటి అద్భుతమైన ఫీల్డింగ్ తో అఫ్గాన్‌ విజయానికి కోహ్లీ అడ్డం పడ్డాడని ఆ దేశం అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు ఆఫ్గాన్ కెప్టెన్ జద్రాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అందుకే విరాట్ కోహ్లీ బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్నాడు.

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×