BigTV English

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Yash Dayal: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {RCB} పేస్ బౌలర్ యష్ దయాల్ కి మరో షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ టి-20 లీగ్ 2025లో పాల్గొనకుండా యష్ దయాల్ పై ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నిషేధం విధించినట్లు సమాచారం. ఇటీవల దయాల్ పై ఫోక్సో కేసు నమోదు కావడంతో యూపీ క్రికెట్ అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Also Read: Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

తాజాగా తన అరెస్టుపై స్టే విధించాలని దయాల్ రాజస్థాన్ హైకోర్టును సంప్రదించాడు. విచారణ జరిపిన కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాకుండా ఆగస్టు 22న కేసు డైరీని సమర్పించాలని ప్రాసిక్యూషన్ ని కోర్టు కోరింది. దయాల్ క్రిమినల్ పిటిషన్ పై ప్రాథమిక విచారణను విచారిస్తూ జస్టిస్ సురేష్ బన్సల్ తో కూడిన సింగిల్ బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు మైనర్ కి సంబంధించిందని కోర్టు పేర్కొంది. ఇలాంటి పరిస్థితులలో స్టే విధించలేము అని స్పష్టం చేసింది. ఈ ఏడాది జూలైలో దయాల్ తనపై అ*** పాల్పడ్డాడని జైపూర్ కి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.


దీంతో జైపూర్ లోని సంఘనేర్ సదర్ పోలీసులు అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. దీనికంటే ముందు దయాల్ పై మరో లైంగిక వేధింపుల కేసు కూడా నమోదయింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఘజియాబాద్ కి చెందిన ఓ యువతి దయాల్ పై ఫిర్యాదు చేసింది. ఈ కేసులో దయాల్ అరెస్టుపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. అయితే ఈ వరుస కేసుల నేపథ్యంలో యష్ దయాల్ పై ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దయాల్ పై వేటుకు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సిద్ధమైనట్లు సమాచారం.

దయాల్ ని ఉత్తరప్రదేశ్ టీ-20 వేలంలో ఘోరక్ పూర్ లయన్స్ {GL} 7 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు యూపీసీఏ నిర్ణయంతో ఘోరక్ పూర్ దయాల్ సేవలను కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఐపీఎల్ 2026 నుండి యష్ దయాల్ ని తప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు యష్ దయాల్ ని పూర్తిగా బెంచ్ కి పరిమితం చేయడం, లేదా జట్టు నుండి విడుదల చేయాలని భావిస్తోందట. ఆర్సిబి వంటి ఫ్రాంచైజీ తమ బ్రాండ్ ఖ్యాతిని కాపాడుకోవడానికి ఈ ఆలోచనలు చేస్తుందట.

Also Read: Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

అలాగే బీసీసీఐ కూడా యష్ దయాల్ పై నిషేధం విధించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే కేవలం ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఆటగాళ్లపై బీసీసీఐ ఆటోమేటిక్ సస్పెన్షన్లను విధించదు. కానీ ఆటగాడి ప్రవర్తన క్రికెట్ ప్రతిష్టకు హాని కలిగిస్తే చర్యలు తీసుకోవడానికి బీసీసీఐ కోడ్ అనుమతిస్తుంది. లీగ్ బ్రాండ్ ను దెబ్బతీసే వివాదాలను ఎదుర్కొంటున్న ఆటగాళ్లను తాత్కాలికంగా తొలగించే అధికారం ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కి ఉంది. ఈ క్రమంలోనే యష్ దయాల్ పై వేటుపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు క్రీడానిపుణులు.

Related News

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Big Stories

×