BigTV English

Monsoon Diet: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే ప్రమాదం తప్పినట్లే..

Monsoon Diet: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే ప్రమాదం తప్పినట్లే..

Monsoon Diet: వర్షాకాలం వచ్చింది అంటే చాలు చాల రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అంటువ్యాధులు, వైరస్, ఇన్ఫెక్షన్లు వంటి అనేక రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అందువల్ల వర్షాకాలంలో తీసుకునే ఆహారంపై చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా మధ్యతరగతి ఇళ్లలో కూరగాయలను కొనుగోలు చేయడానికే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతాయి. కూరగాయలను కొనుగోలు చేయలేక పప్పులతో గడిపేస్తుంటారు.


అయితే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలనే ఆలోచన కాకుండా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆలోచించి మెదులుతుంటారు. అయితే వర్షాకాలంలో సాధారణంగా కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పప్పుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీటిలో ఉండే మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్, ప్రొటిన్, ఫైబర్ వంటి అనేక రకాల మినరల్స్ శరీరానికి చాలా విధాలుగా తోడ్పడతాయి.

పప్పులు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కానీ వర్షాకాలంలో కొన్ని రకాల పప్పులు తీసుకోవడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 3 రకాల పప్పులు తినడం వల్ల శరీరంలో చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అందువ్లల గ్యాస్, కడుపులో మంట, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి చాలా కడుపు సంబంధింత సమస్యలు తలెత్తుతాయి. పప్పుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఫైబర్ ఎక్కువైనా కూడా సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల రాజ్మా, శెనగలు, పెసర్లు వంటి పప్పులకు దూరంగా ఉంటే మంచిది.


Tags

Related News

Makhana: వీళ్లు.. పొరపాటున కూడా మఖానా తినకూడదు !

Stress: క్షణాల్లోనే.. స్ట్రెస్ తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Vitamin K Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Big Stories

×