BigTV English

Suryakumar Yadav : సూర్యా.. ఐపీఎల్, టీ 20 ప్రపంచకప్ కూడా డౌటేనా?

Suryakumar Yadav : సూర్యా.. ఐపీఎల్, టీ 20 ప్రపంచకప్ కూడా డౌటేనా?
Suryakumar Yadav

Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్.. ఒంటి చేత్తో మ్యాచ్ లను గెలిపించగల యోధుడు. క్రీజులోకి వెళ్లాడంటే ఆకాశమే హద్దుగా చెలరేగే ధీరుడు. అందుకే తనని అందరూ స్కై అంటారు.  బౌలర్ బాల్ ఎలా వేసినా సరే, క్రీజులో 360 డిగ్రీలు గిర్రుమని తిరిగి, బ్యాట్ తో కొట్టగల సమర్థుడు. అలాంటి సూర్యా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో కాలి మడమ గాయంతో పెవిలియన్ కే పరిమితమయ్యాడు..


గాయం తగ్గడానికి సమయం పడుతుందని చెబుతూ వచ్చాడు. ఇప్పుడు చూస్తుంటే కాలికి ఆపరేషన్ తప్పదని డాక్టర్లు చెప్పారనేది ఒక సమాచారం. మరో కొద్దిరోజుల్లో ఆపరేషన్ చేస్తారు. తర్వాత కనీసం మూడు నెలలైనా రెస్ట్ తప్పదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ లకు కూడా దూరమయ్యేలా కనిపిస్తోంది.

అదే జరిగితే, ఐపీఎల్ అయిన వెంటనే జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే టీ 20 ప్రపంచ కప్ నకు కూడా అందుబాటులో డౌటే అంటున్నారు. ప్రస్తుతం జనవరి నెల నడుస్తోంది. ఇంకా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నాలుగు నెలల సమయం ఉంది.


ఆపరేషన్ చేయించుకున్నాక అసలైన పరీక్ష.. ఫిట్ నెస్ సాధించాల్సి ఉంటుంది. అందుకు కనీసం నెలరోజులైనా సమయం కావాలి. ఈలోపు పొట్టి ప్రపంచకప్ కూడా అయిపోయేలాగే ఉంది. అసలు విషయం ఏమిటంటే సూర్యకుమార్ కి కాలి మడమ గాయం ఒక్కటే కాదు..హెర్నియా సమస్య కూడా ఉందని తెలిసింది.

ఈ ఆపరేషన్ కోసం సూర్య జర్మనీ వెళ్లాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో అతడు కోలుకుంటున్నాడు. రెండు మూడు రోజుల్లో జర్మనీకి వెళ్లి ఆపరేషన్ చేయించుకోనున్నాడు. అతడు కోలుకునేందుకు 2-3 నెలలు సమయం పట్టవచ్చునని సమాచారం.  ఈ నేపథ్యంలో సూర్య ఫిట్ నెస్ పై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది.

అన్నీ బాగా కుదిరి తను ఫిట్ గా ఉంటేనే, పొట్టి ప్రపంచకప్ జట్టుకి ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఎక్స్ ట్రా ప్లేయర్ గా భావించే జట్టుని ఎంపిక చేయాలని చూస్తోంది. అంటే 14 మంది జట్టులో ఉంచాలా?వద్దా? అనేది కూడా సందేహామే అంటున్నారు.

అయితే అదేం పెద్ద మేటర్ కాదు, ఇందులోంచి ఒకరిని తప్పించి, మరొకరిని తీసుకురావచ్చునని పలువురు పేర్కొంటున్నారు. వన్డే వరల్డ్ కప్ లో ప్రసిద్ధ్ క్రష్ణని అలాగే తీసుకువచ్చారు కదా అని గుర్తు చేస్తున్నారు. ముందు సూర్య ఫిట్ నెస్ సాధిస్తే పొట్టి వరల్డ్ కప్ మధ్యలోనైనా జట్టుతో కలుస్తాడని చెబుతున్నారు.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×