BigTV English

NASA: అమెరికా జాబిల్లి యాత్ర.. 50 ఏళ్ల తర్వాత ప్రయోగం.. చంద్రుడిని చేరేనా?

NASA: 50 ఏళ్ల తర్వాత జాబిల్లిపై దృష్టి సారించింది నాసా. 1972 తర్వాత తొలిసారి ఈరోజు మూన్‌ మిషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది.అస్ట్రోబోటిక్ టెక్నాలజీస్‌ అనే ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన స్పేస్‌ క్రాఫ్ట్‌ను జాబిల్లిపైకి పంపింది నాసా. పెరెగ్రైన్‌ లూనార్ ల్యాండర్‌గా దీనికి నామకరణం చేసింది నాసా. యూనైటెడ్ లాంచ్‌ అలయన్స్‌ వుల్కాన్‌ రాకెట్‌ ద్వారా స్పేస్‌ క్రాఫ్ట్‌ను నింగిలోకి పంపింది నాసా. మొత్తం 20 పేలోడ్లను నింగిలోకి మోసుకెళ్లింది నాసా.

NASA:  అమెరికా జాబిల్లి యాత్ర.. 50 ఏళ్ల తర్వాత ప్రయోగం.. చంద్రుడిని చేరేనా?

NASA: 50 ఏళ్ల తర్వాత జాబిల్లిపై దృష్టి సారించింది నాసా. 1972 తర్వాత తొలిసారి ఈరోజు మూన్‌ మిషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. అస్ట్రోబోటిక్ టెక్నాలజీస్‌ అనే ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన స్పేస్‌ క్రాఫ్ట్‌ను జాబిల్లిపైకి పంపింది నాసా. పెరెగ్రైన్‌ లూనార్ ల్యాండర్‌గా దీనికి నామకరణం చేసింది నాసా. యూనైటెడ్ లాంచ్‌ అలయన్స్‌ వుల్కాన్‌ రాకెట్‌ ద్వారా స్పేస్‌ క్రాఫ్ట్‌ను నింగిలోకి పంపింది నాసా. మొత్తం 20 పేలోడ్లను నింగిలోకి రాకెట్ మోసుకెళ్లింది.


ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ వచ్చే నెల 23న జాబిల్లిపై ల్యాండ్ కానుంది. ల్యాండ్‌ అయిన వెంటనే చంద్రుడిపై పరిశోధనలు జరపనుంది. చంద్రుడిపై నీరు, మంచు అవశేషాలతోపాటు రేడియేషన్‌, మ్యాగ్నటిక్ ఫీల్డ్‌ను స్టడీ చేయనుంది. అంతేగాకుండా హైడ్రోజన్ కంటెంట్ , థర్మల్ ప్రాపర్టీస్‌, లూనార్ ఎక్సోస్పీయర్‌ను కూడా స్టడీ చేయనుంది నాసా.

1971లో అపోలో 17 మిషన్ చివరిసారిగా నాసా చేపట్టిన మూన్ మిషన్‌. ఆ తర్వాత చంద్రుడిపై దృష్టి సారించలేదు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ పెరెగ్రైన్‌ లూనార్ మిషన్‌ను చేపట్టింది.


ఇటీవల చంద్రయాన్‌ సక్సెస్‌తో ఇస్రో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఇస్రో బాటలోనే నాసా ప్రయాణిస్తోంది. అదే సమయంలో స్పేస్‌ మిషన్లలో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తోంది నాసా. ఈ లూనార్‌ మిషన్‌ కూడా చంద్రయాన్‌ లాగానే చక్కర్లు కొడుతూ కక్ష్యను తగ్గించుకుంటూ జాబిల్లిపై ల్యాండ్ కానుంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×