BigTV English

Natarajan : ఒక్కో బాల్ కు 60 లక్షలు.. నటరాజన్ క్రేజ్ మామూలుగా లేదు

Natarajan : ఒక్కో బాల్ కు 60 లక్షలు.. నటరాజన్ క్రేజ్ మామూలుగా లేదు

Natarajan : ఐపీఎల్ 2025లో సీజన్ లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో జట్టు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆటగాళ్లను కొనుగోలు చేసినా వారు అంతగా రాణించడం లేదు. మరికొన్ని జట్లలో కీలక ఆటగాళ్లున్నప్పటకీ వారిని సరిగ్గా ఉపయోగించడంలో కూడా విఫలం చెందుతున్నారు. అన్ని సరిగ్గా వాడుకొని.. రాణించిన వారే సక్సెస్ సాధిస్తున్నారు. అలా వినియోగించుకునే వాటిలో ముంబై ఇండియన్స్ ముందుంది అనే చెప్పాలి. ఇక మరో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసినప్పటికీ.. వారిని సరిగ్గా వాడుకోలేదు. ముఖ్యంగా పేస్ బౌలర్ నటరాజన్ సేవలను వినియోగించుకోలేక తిప్పలు పడింది. మెగా వేలంలో నటరాజన్ ను రూ.10.75 కోట్లకు దక్కించుకోంది ఢిల్లీ క్యాపిటల్స్. 14 మ్యాచ్ లకు కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే ఆడించింది. వాటిలో 3 ఓవర్లు మాత్రమే వేశాడు. అంటే ఒక్కో బంతికి నటరాజన్ కి రూ.60లక్షలు అందాయన్నమాట.


Also Read :  IPL 2025:ముంబై కోసం పని చేస్తున్న ఎలిమినేట్ టీమ్స్.. ఇవి అంబానీ కుట్రలేనా

ప్రస్తుతం నటరాజన్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సీజన్ ప్రారంభంలో వరుస విజయాలు సాధించి టేబుల్ టాపర్ గా నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఆ తరువాత వరుసగా 4 మ్యాచ్ లు ఓడి ప్లే ఆప్స్ రేస్ నుంచి తప్పుకుంది. ప్లే ఆప్స్ కి చేరకపోయినా ఈ సీజన్ లో ఢిల్లీ మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ సీజన్ కి స్టార్ ఆటగాళ్లను కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ వారిని సరిగ్గా వాడుకోలేకపోయింది. ముఖ్యంగా యార్కర్ల స్పెషలిస్ట్  నటరాజన్ ని ఢిల్లీ కొనుగోలు చేసింది. నటరాజన్ బౌలింగ్ చాలా కాస్ట్ లీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి పంజాబ్ కింగ్స్ తో జరిగిన చివరి మ్యాచ్ లో కూడా నటరాజన్ కి అవకాశం లభించలేదు. నటరాజన్ కి బదులు ముఖేష్ కుమార్ కి ఢిల్లీ అవకాశాలు ఇచ్చింది. అతను మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాడు.


ఇక  ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లు బాది హాఫ్ సెంచరీ చేశాడు. మార్కస్ స్టోయినీస్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్ లతో 44 నాటౌట్. ఇంగ్లీషు 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 32 దూకుడుగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజర్ రెహ్మన్ 3/33.. విప్రజ్ నిగమ్ 2/38, కుల్దీప్ యాదవ్ 2/39 రెండేసి వికెట్లు పడగొట్టారు. ముఖేష్ కుమార్ కి ఓ వికెట్ దక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 44 రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్ 2/41 రెండు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, ప్రవీణ్ దూబె చెరో వికెట్ పడగొట్టారు. సన్ రైజర్స్ హైదరాబాద్ లో నటరాజన్ కీలక బౌలర్ గా రాణించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో అంతగా రాణించకపోవడంతో.. అతనికి ఢిల్లీ క్యాపిటల్స్ ఛాన్స్ ఇవ్వడం లేదని ఢిల్లీ అభిమానులు పేర్కొంటున్నారు.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×