EPAPER

T20 World cup 2024 West indies vs England: ఆతిధ్య జట్టుకు షాక్, విండీస్‌‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లాండ్

T20 World cup 2024 West indies vs England: ఆతిధ్య జట్టుకు షాక్, విండీస్‌‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లాండ్

T20 World cup 2024 West indies vs England: టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆసక్తికరంగా సాగుతోంది. లీగ్ దశ ముగియడంతో అందరి చూపు సూపర్ 8 మ్యాచ్‌లపై పడింది. తాజాగా ఆతిధ్య జట్టుకు షాకిచ్చింది ఇంగ్లాండ్. విండీస్‌‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గింది ఆ జట్టు.


సెయింట్ లూసియా వేదికగా గురువారం వెస్టిండీస్-ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. విండీస్ ఆటగాళ్లు విసిరిన 181 పరుగుల విజయ లక్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది ఇంగ్లాండ్ జట్టు. 17.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగారు ఇంగ్లాండ్ ఓపెనర్లు సాల్ట్-బట్లర్. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో వీరిద్దరు దూకుడుగా ఆడారు. మైదానం నలుమూలలా చూడచక్కని షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 67 పరుగులు చేశారు.

అయితే 7.4 ఓవర్ల వద్ద బట్లర్ ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన మెయిన్ అలీ తక్కువ పరుగులకే ఔటయ్యాడు. ఈలోగా వచ్చిన బెయిర్‌స్టో-సాల్ట్ విరుచుకుపడ్డారు. విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. ఈ జంటను విడదీసేందుకు ఆతిధ్య జట్టు రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు 17.3 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించారు ఇంగ్లీష్ ఆటగాళ్లు.


ALSO READ: వెస్టిండీస్ భారీ స్కోర్, ఇంగ్లాండ్ టార్గెట్ 181 పరుగులు

సాల్ట్ కేవలం 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. అందులో ఏడు ఫోర్లు, ఐదు సిక్స్ లున్నాయి. విండీస్‌ బౌలర్ రొమారియో షెఫర్డ్ వేసిన 16వ ఓవర్‌లో  ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్‌ సాల్ట్ రెచ్చిపోయాడు. ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. బెయిర్‌స్టో  26 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సాల్ట్‌ని వరించింది. లీగ్‌లో పేలవమైన ఆటతీరును ప్రదర్శించిన ఇంగ్లాండ్ జట్టు, సూపర్ 8లో మాత్రం దూకుడు ప్రదర్శించడం కొసమెరుపు.

Tags

Related News

Cristiano Ronaldo: సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్.. 100 కోట్లు

Bangladesh Team: ఒక్కరు తప్ప.. అంతా వస్తున్నారు!: బంగ్లా జట్టు ప్రకటన

India’s Paralympic Champions: పారాలింపిక్స్ విజేతలకు.. మోదీ మార్క్ ఆతిథ్యం

Duleep Trophy 2024: సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్

Natasa Stankovic: సరిపోయారు.. ఇద్దరికిద్దరూ! బాయ్ ఫ్రెండ్ తో హార్దిక్ మాజీ భార్య నటాషా

Virat Kohli- Babar Azam: విరాట్ – బాబర్.. ఒకే జట్టులో గురుశిష్యులు ?

Duleep Trophy 2024: రింకూ, అయ్యర్, శాంసన్: ఈ ముగ్గురిలో చోటెవ్వరికి?

Big Stories

×