BigTV English

Ravichandran Ashwin : 11 వికెట్ల దూరంలో.. అశ్విన్ ..

Ravichandran Ashwin : 11 వికెట్ల దూరంలో.. అశ్విన్ ..

Ravichandran Ashwin : 37 సంవత్సరాల రవిచంద్రన్ అశ్విన్ కూడా 500 వికెట్ల క్లబ్ లో చేరేందుకు 11 వికెట్ల దూరంలో ఉన్నాడు. మరి తొలిరోజు వరుణుడి ఆటంకం లేకుండా మ్యాచ్ సజావుగా సాగితే రెండు ఇన్నింగ్స్ లో కలిపి 11 వికెట్లు చకచకా తీసేస్తే తను కూడా 500 వికెట్ల క్లబ్ లో చేరుతాడు. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకుంటాడు.


నిజంగా అశ్విన్ అంత ప్రతిభావంతుడైన క్రికెటర్ అయినప్పటికి తనకి రావల్సినంత పేరు రాలేదని అంతా అంటుంటారు. మరి అది అతనికి వరమో, శాపమో తెలీదు కానీ, మిగిలిన క్రికెటర్లలా ఎప్పుడూ మీడియాలో హైలెట్ కాలేదు. అయితే తను కూడా ఎప్పుడూ దానిగురించి ఆలోచించలేదు. తన పనిని తాను సైలంట్ గా చేసుకుంటూ వెళ్లిపోయాడు.

ఇప్పుడు 500 వికెట్ల క్లబ్ లో చేరేందుకు కేవలం 11 వికెట్ల దూరంలో ఉండేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి? అశ్విన్ 500 వికెట్లకి దగ్గరలో ఉన్నాడా? అంటున్నారు. 94 టెస్ట్ మ్యాచ్ ల్లోనే అశ్విన్ 489 వికెట్లు తీసుకున్నాడు. అయితే తనకన్నా ముందు మురళీధరన్ (800), షేన్ వార్న్(708), జేమ్స్ అండర్సన్(690), అనిల్ కుంబ్లే(619), స్టువర్ట్ బ్రాడ్(604), గ్లేన్ మెక్‌గ్రాత్(563), వాల్ష్(519), నాథన్ లియోన్ (501) ఉన్నారు.


అయితే భారత్ లో చూస్తే మాత్రం అనిల్ కుంబ్లే (619) ఒక్కరే ఉన్నారు. అంటే 500 వికెట్ల క్లబ్ లోకి అశ్విన్ చేరితే  రెండో బౌలర్ గా చరిత్ర సృష్టించనున్నాడు. అయితే దురదృష్టం ఏమిటంటే మొదటి టెస్ట్ మ్యాచ్ లో అశ్విన్ కు ఆడే అవకాశం లేనట్టుగానే కనిపిస్తోంది.

సెంచూరియన్ పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఒకవేళ అశ్విన్ ఈ మ్యాచ్ ఆడినా.. 11 వికెట్లు తీయడం అసాధ్యంగానే ఉంది. ఎందుకంటే పేస్ కు అనుకూలించే  పిచ్ పై అశ్విన్ స్పిన్‌  మంత్రం పనిచేయదని అంటున్నారు. ఒకవేళ రెండు టెస్టులు ఆడితే మాత్రం అశ్విన్ కసిగా బౌలింగ్ చేసి రికార్డు సృష్టిస్తాడని నెట్టింట అభిమానులు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×