E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Tanveer Ahmed: పాకిస్తాన్ లో అడుగు పెట్టేట‌ప్పుడు జాగ్ర‌త్త‌..రాళ్ల‌తో అభిమానులు కొడ‌తారు

Tanveer Ahmed: పాకిస్తాన్ లో అడుగు పెట్టేట‌ప్పుడు జాగ్ర‌త్త‌..రాళ్ల‌తో అభిమానులు కొడ‌తారు
Advertisement

Tanveer Ahmed:  T20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో (2026 Women’s T20 World Cup tournament) పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఆడిన నాలుగు మ్యాచ్ ల‌లో కూడా పాకిస్తాన్ మహిళల జట్టు (Pakistan women’s team) అత్యంత దారుణంగా ఓడిపోయింది. అయితే వరుసగా మూడవ ఓటమిని చవిచూసిన పాకిస్తాన్ మహిళల జట్టు… టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం నామమాత్రంగా లీగ్ దశ మ్యాచ్ లు ఆడుతోంది పాక్. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మహిళల జట్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed). పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు, కోచ్ వ‌హాబ్ రియాజ్ ( Wahab Riaz) ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి వచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు. ఆగ మేఘాలపైన పాకిస్తాన్ లో ( Pakistan) అడుగుపెడితే, అభిమానులు రాళ్లతో కొట్టడం గ్యారంటీ అని హెచ్చరించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ కు వచ్చే ముందు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు తన్వీర్ అహ్మద్.

Also Read: PCB Set To Send Pakistan Players To USA: సిక్స‌ర్లు కొట్టాలంటూ పాక్ ప్లేయ‌ర్ల‌పై PCB ఒత్తిడి..అమెరికాలో స్పెష‌ల్ ట్రైనింగ్

పాకిస్తాన్ లో అడుగు పెట్టేట‌ప్పుడు జాగ్ర‌త్త‌..రాళ్ల‌తో అభిమానులు కొడ‌తారు

Advertisement

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు, కోచ్ వ‌హాబ్ రియాజ్ రెస్టారెంట్లలో ఎంజాయ్ చేసిన ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఫాస్ట్ ఫుడ్ తింటూ కొంతమంది ఎంజాయ్ చేస్తే… మరి కొంతమంది ఆల్కహాల్ కూడా తీసుకున్నారు. ఈ ఫోటోలు బయటకు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టుపై తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. టి20 మహిళల ప్రపంచ కప్ టోర్నమెంటులో టీమిండియా అద్భుతంగా ముందుకు వెళుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందని ఆగ్రహించారు.

వాళ్ళ లాగా మనోళ్లు ఎందుకు వాడడం లేదని ప్రశ్నించారు. ఎలిమినేట్ అయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా పార్టీలు చేసుకుంటారా ? అని నిలదీశారు. ఎలిమినేట్ అయిన తర్వాత తలదించుకొని మిగిలిన మ్యాచ్ లపై ఫోకస్ చేయకుండా.. జల్సాలు చేయడం చాలా తప్పు అన్నారు. ఎలిమినేట్ అయినందుకు పాకిస్తాన్ అభిమానులు బాధపడడం లేదని… మీరు పార్టీలు చేసుకున్నందుకే సీరియస్ అవుతున్నారని ఆగ్రహించారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లు, కోచ్ వ‌హాబ్ రియాజ్ స్వదేశానికి వస్తే రాళ్లతో కొట్టడం గ్యారంటీ అన్నారు. కొన్ని రోజులపాటు పాకిస్తాన్ లో ముసుగు వేసుకొని తిరగాలని కూడా హెచ్చరించారు. అంత ఆగ్రహంతో పాకిస్తాన్ అభిమానులు ఉన్నారని ఓ టీవీ ఛానల్ లో పేర్కొన్నారు తన్వీర్ అహ్మద్. ఇక‌నైనా గ్రూప్ స్టేజ్ లో ఉన్న మ్యాచ్ ల‌లో పాక్ విజ‌యం సాధించాల‌ని కోరారు.

Advertisement

Also Read: Rishabh Pant returns to Delhi Capitals: ఢిల్లీ క్యాపిట‌ల్స్ లోకి రిష‌బ్ పంత్..కొంచెమైనా సిగ్గుండాలంటూ వార్న‌ర్ వివాద‌స్ప‌ద పోస్ట్!

 

Related News

విరాట్ కోహ్లీకి బిగ్ షాక్‌.. మార్కెట్ లో ఫేక్ వన్8 షూస్ క‌ల‌క‌లం !

హర్షిత్ రాణాకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా ? ఆస్ప‌త్రి నుంచి రాగానే సెల‌క్ట్ చేశారు

Kapil Dev: వైభ‌వ్ పై అంచ‌నాలు పెట్టుకోకండి..20 ఏళ్ల‌కే అత‌ని కెరీర్ క్లోజ్ ?

హ‌రీస్ రౌఫ్ పై అణిచివేత‌…అమెరికా గ‌డ్డపై పాక్ ప‌రువు తీసిన అశ్విన్‌

Hasan Ali: కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్ద‌రే పాకిస్తాన్ క్రికెట్ ను నాశ‌నం చేశారు

Tanveer Ahmed: ఇంగ్లండ్ పై వైభ‌వ్ సెంచ‌రీ చేస్తే..బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

Fatima Sana: డ్రెస్సింగ్ రూంలోనే అలియ కాపురం పెట్టింది..ప‌ట్టించుకునే వాడే లేడు

Big Stories

×