E-Paper
Advertisement

నల్ల జాతీయులను సెల‌క్ట్ చేయొద్దు..ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్ల‌పై పీట‌ర్సన్ సంచ‌ల‌నం !

నల్ల జాతీయులను సెల‌క్ట్ చేయొద్దు..ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్ల‌పై పీట‌ర్సన్ సంచ‌ల‌నం !
Advertisement

Kevin Pietersen On South Africa Team: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుపై మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నల్ల జాతీయులను దక్షిణాఫ్రికా జట్టులోకి తీసుకోకూడదని.. ప్రతిభ ఉన్న వాళ్లను తీసుకోవాలంటూ బాంబు పేల్చారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కెవిన్ పీటర్సన్, నిత్యం టీమిండియాతో పాటు ఐపీఎల్ ను మెచ్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో నల్లజాతీయులు ఎక్కువగా ఉన్నారని.. అందరూ వాళ్లే ఉంటే పెద్దగా ప్రయోజనం ఉండదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కెవిన్ పీటర్సన్. రిజర్వేషన్ ప్రకారం నల్ల జాతీయులను సెలెక్ట్ చేస్తున్నారని… కానీ టాలెంట్ ఉన్న వాళ్లకు ప్రాధాన్యత ఇస్తే దక్షిణాఫ్రికాను ఆపడం ఎవరి తరం కాదని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రూల్స్ ను సడలించి.. నల్ల జాతీయులతో పాటు టాలెంట్ ఉన్న వాళ్లను ఎంకరేజ్ చేయాలని కోరారు. దీంతో కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

దక్షిణాఫ్రికా జట్టులో ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ

Advertisement

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు లో ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని అమలు చేస్తున్నారు. ఒకప్పుడు శ్వేత జాతీయల ఆటగానే ఉండిపోయిన క్రికెట్ ను.. మెజారిటీ జనాభా ఉన్న నలజాతీయులకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ రూల్ తీసుకువచ్చారు. ఆ దేశంలో ఎక్కువగా నల్ల జాతీయులు ఉంటారు కాబట్టి.. వాళ్ల సామాజిక వర్గానికి మాత్రమే క్రికెట్ లో అవకాశాలు ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని తెరపైకి తీసుకువచ్చింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు. ఈ పాలసీ ప్రకారం దక్షిణాఫ్రికా జట్టులో కచ్చితంగా కొంతమంది నల్ల జాతీయులు ఉండాలి. అప్పుడే జట్టు సెలక్షన్ జరుగుతుంది.

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

దక్షిణాఫ్రికా జట్టు ఎంపిక నిబంధనలు

Advertisement

దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్ జట్టును ఎంపిక చేసేటప్పుడు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. కనీసం ఆరుగురు శ్వేత జాతీయేతరులు జట్టులో ఉండాల్సి ఉంటుంది. అలాగే నల్ల జాతీయులకు కచ్చితంగా ఇద్దరికైనా అవకాశం ఇవ్వాలి. అంటే ఒక ఆరుగురిని సెలెక్ట్ చేస్తే అందులో టెంబా బవుమా, లుంగి ఎంగిడీ, కగిసో రబడ లాంటి క్రికెటర్లను ఇద్దరినైనా దక్షిణాఫ్రికా జట్టులోకి తీసుకోవాలి.

నల్ల జాతీయులను సెల‌క్ట్ చేయొద్దు.. పీట‌ర్సన్ సంచ‌ల‌నం !

దక్షిణ ఆఫ్రికా జట్టులో ఎక్కువ శాతం నల్ల జాతీయులు ఉన్న నేపథ్యంలో కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జాత్యహంకారిని కాదని… కానీ దక్షిణాఫ్రికా తరఫున ఉండే నల్ల జాతీయులకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వకూడదని కోరారు. ఆ జట్టులో 11 మంది నల్ల జాతి ఆటగాళ్లు ఉన్న తనకు అభ్యంతరం లేదు.. కానీ ప్రతిభ ఉన్న వాళ్లకు మాత్రమే ఛాన్స్ ఇవ్వాలని స్పష్టం చేశారు.

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

Related News

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!

ఏషియన్ గేమ్స్ లో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టి, ఘోరంగా ఓడిస్తాం

దిండుపై పడుకుని బుమ్రా రిలాక్స్…మీకు పని పాట లేదంటూ పరువు తీసిన సంజనా గణేశన్

న్యూజిలాండ్ సిరీస్‌లో వైభవ్‌ను ఒత్తిడిలోకి నెట్టి..బౌన్సర్లతో టార్చర్ చేస్తాం

Big Stories

Advertisement
×