Tanveer Ahmed Warns Vaibhav: పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ అంత దుర్మార్గుడు ఎవడు లేడు. పొద్దున లేస్తే చాలు టీమిండియా క్రికెటర్ల పైన పడి చస్తూ ఉంటాడు. ఎవరో ఒకరిని విమర్శిస్తూనే ఉంటాడు. అంతర్జాతీయంగా టీమిండియాను బ్లేమ్ చేసే ప్రయత్నం నిత్యం చేస్తూనే ఉంటాడు తన్వీర్ అహ్మద్. అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నువ్వు కించపరిచేలా పోస్టులు పెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో తాజాగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పైన విరుచుకుపడ్డాడు. వైభవ్ కెరీర్ నాశనం చేస్తానంటూ హెచ్చరించారు. సెప్టెంబర్ మాసం వరకే వైభవ్ జల్సాలు చేసుకోవాలని.. ఆ తర్వాత ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. ఆసియా క్రీడలు 2026 టోర్నమెంటు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK ) మధ్య మ్యాచ్ జరుగుతుందని వెల్లడించారు. ఈ సమయంలోనే వైభవ్ ను తమ బౌలర్లు దెబ్బ కొడతారని హెచ్చరించారు.
ఆసియా గేమ్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 17వ తేదీ తర్వాత ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏషియన్ గేమ్స్ ( Asian Games 2026) సందర్భంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు వైభవ్ అంతు చూస్తామని హెచ్చరించారు. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్ లో జరుగుతుంది కాబట్టి… వైభవ్ ఆడతాడని అంచనా వేశారు. ఈ సందర్భంగా వైభవ్ తల పగిలేలా పాకిస్తాన్ బౌలర్లు బౌన్సర్లు సంధిస్తారని హెచ్చరించారు.
Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భయ్యా…కోహ్లీని, నన్ను బండబూతులు తిట్టాడు
తమ బౌలర్ల దెబ్బకు వైభవ్ ( Vaibhav Sooryavanshi ) ఖచ్చితంగా గాయపడతాడని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఒక్కసారి గాయం బారిన వైభవ్ సూర్యవంశీ పడితే మాత్రం, అతడు కోల్పోవడం కష్టమేనన్నారు. మళ్లీ టీమిండియాలోకి రావడం గగనమేనని తెలిపారు. అతని ఫిట్నెస్ లెవల్స్ ఏమాత్రం సరిగ్గా లేవని.. డ్రగ్స్ తీసుకొని ఆడతాడని కూడా ఆరోపణలు చేశారు. అందుకే ఒక్కసారి వైభవ్ గాయపడితే… అతని కెరీర్ కనుమరుగు కావడం గ్యారెంటీ అంటూ సవాల్ విసిరారు. ఒకవేళ వైభవ్ కెరీర్ క్లోజ్ కాకపోతే తాను బట్టలు లేకుండా లాహోర్ వీధుల్లో తిరుగుతానని ఛాలెంజ్ చేశారు.
15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ వయస్సు విషయంలో కూడా మరోసారి పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ అనుమానాలు వ్యక్తం చేశారు. వాడు 15 ఏళ్ల కుర్రాడు కాదని… కచ్చితంగా అతని వయస్సు 20 సంవత్సరాలకు పైగా ఉంటుందని ఆరోపణలు చేశారు. దీనిపై ఐసీసీ కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ… తక్కువగా చూపించడం దారుణం అన్నారు.