E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఢిల్లీ క్యాపిట‌ల్స్ లోకి రిష‌బ్ పంత్..కొంచెమైనా సిగ్గుండాలంటూ వార్న‌ర్ వివాద‌స్ప‌ద పోస్ట్!

ఢిల్లీ క్యాపిట‌ల్స్ లోకి రిష‌బ్ పంత్..కొంచెమైనా సిగ్గుండాలంటూ వార్న‌ర్ వివాద‌స్ప‌ద పోస్ట్!
Advertisement

David Warner mocks DC owner:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 (Indian Premier League 2027) నేపథ్యంలో ఇప్పటి నుంచే ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తమ జట్టును బలంగా తయారు చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి బలమైన ప్లేయర్లను లాగేసుకుంటోంది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్టు కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ను తాజాగా ట్రేడ్ చేసిన ఢిల్లీ… కుల్దీప్ యాదవ్ ను లక్నోకి ఇచ్చేసింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మళ్లీ బరిలోకి దిగుతాడు రిషబ్ పంత్. అయితే ఈ ట్రేడ్ డీల్ పై ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner ) వివాదాస్పద పోస్ట్ పెట్టాడు.

Also Read:  Jemimah Rodrigues ICC Women’s T20 World Cup 2026: వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

ఢిల్లీలోకి రిష‌బ్ పంత్..కొంచెమైనా సిగ్గుండాలంటూ వార్న‌ర్ పోస్ట్!

Advertisement

రిషబ్ పంత్ ను (Rishabh Pant) తీసుకోవడానికి సిగ్గుగా అనిపించడం లేదా? వేలం సమయంలో గడ్డి పీకారా ? అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ పార్థ్ జిందల్ ( Parth Jindal) ను ఉద్దేశించి వివాదాస్పద పోస్ట్ పెట్టారు డేవిడ్ వార్నర్. అప్పట్లో జరిగిన వేలం సమయంలోనే, రిషబ్ పంత్ ను రిటైన్ చేసుకుంటే సరిపోయేది కదా ? అన్న అర్థం వచ్చేలా ఈ పోస్ట్ పెట్టారు. అనవసరంగా లక్నో కొనుగోలు చేసే దాకా, చూశారని మండిపడ్డారు. అప్ప‌ట్లోనే రిష‌బ్ పంత్ ను అంటిపెట్టుకుని ఉంటే, ఢిల్లీ ఇప్ప‌టికే ఛాంపియ‌న్ అయ్యేద‌నే అర్థం వ‌చ్చేలా స్పందించారు వార్న‌ర్. ఇప్పుడు మళ్లీ రిషబ్ పంత్ ను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకువచ్చారని నిలదీశారు. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్లకు బుర్ర లేదంటూ స్మైల్ ఎమోజీలు ఉన్న ఫోటోలు కూడా షేర్ చేశాడు. దీంతో డేవిడ్ వార్నర్ ( David Warner) చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

రిష‌బ్ పంత్ – కుల్దీప్ యాద‌వ్ మ‌ధ్య బిగ్ డీల్

ఐపీఎల్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య అతిపెద్ద ట్రేడ్ డీల్ కుదిరింది. మొన్నటి వరకు 27 కోట్లు తీసుకొని లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు రిషబ్ పంత్ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కుల్దీప్ యాదవ్ 13.50 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున తీసుకొని ఆడాడు. ఈ క్రమంలో లక్నో వర్సెస్ ఢిల్లీ మధ్య ట్రేడ్ జరిగింది. ఇందులో భాగంగానే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి రిషబ్ పంత్ రాబోతున్నాడు. కానీ 27 కోట్లు గతంలో తీసుకున్న పంత్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 15 కోట్లు మాత్రమే తీసుకోబోతున్నాడు. అంటే 12 కోట్లు కోత విధించబడబోతోంది. కుల్దీప్ యాదవ్ మాత్రం సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. ఎప్పటిలాగే లక్నోలో కూడా 13.50 కోట్లు అతనికి దగ్గర ఉన్నాయి.

Advertisement

Also Read: Daryll Cullinan has raised public concern over Vaibhav Sooryavanshi: ఈ లేత వ‌య‌స్సులో వేగంగా బ్యాటింగ్ చేసి, ప్రాణాల‌పైకి తెచ్చుకోవ‌ద్దు ? వైభ‌వ్ కు డారిల్ హెచ్చ‌రిక‌లు

 

Related News

మొగుడితో రొమాన్స్ చేస్తూ, ఇంగ్లండ్ లో పాక్‌ ప్లేయ‌ర్ షికార్లు..PCBకి ఫిర్యాదు చేసిన స‌నా

వైభవ్ ను మొదటి బంతికే డకౌట్ చేస్తా..అత‌ని వికెట్ తీసే మొన‌గాడిని నేనొక్కడినే

వరుసగా 4 మ్యాచ్ ల‌లో పాక్ ఓటమి…ఇప్పుడు సమోసా, బజ్జీలు ఆర్డర్ చేయండి అంటూ ట్రోల్స్

యువతితో సహజీవనం, ప్రెగ్నెంట్ అయ్యాక హ్యాండ్.. ఐపీఎల్ ప్లేయ‌ర్ అరెస్ట్ ?

పాకిస్తాన్ క్రికెట్ ను గాడిలో పెట్టేందుకు త్రిముఖ వ్యూహాం..అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

ఓడిపోయామ‌న్న సిగ్గులేకుండా, పందుల్లా తింటున్నారు..మ‌హిళా క్రికెట‌ర్ల‌పై ఇంజ‌మామ్ సీరియ‌స్‌

Sunil Gavaskar: ఎవ‌డికి ప‌డితే, వాళ్ల‌కు ‘ఇండియా క్యాప్’ అస్స‌లు ఇవ్వొద్దు

Big Stories

×