Mohammad Yousuf On IND VS PAK: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs. Pakistan) మధ్య మ్యాచ్ లు అంటే జనాలకు పండగే. ఈ రెండు జట్ల మధ్య ఎలాంటి మ్యాచ్ జరిగినా కూడా జనాలు టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. అయితే ఈ రెండు జట్ల మ్యాచ్ అప్పట్లో జరిగిన ప్రతిసారి, పాకిస్తాన్ ఎక్కువగా గెలిచేదన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో పరిస్థితి పూర్తిగా మారింది.. ప్రతి మ్యాచ్ పాకిస్తాన్ పైన టీమిండియానే గెలుస్తోంది. ఇలాంటి క్రమంలో టీమిండియాను కించపరిచేలా మహమ్మద్ యూసఫ్ (Mohammad Yousuf) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ను ఓడించే శక్తి టీమిండియాకు లేదని పరువు తీసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు గెలుస్తున్నారు కావచ్చు.. కానీ, భవిష్యత్తులో గెలవడం కష్టమేనని స్పష్టం చేశారు.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs. Pakistan) జయాపరాజయాల పైన మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టును ఓడించే శక్తి ఇప్పటికి కూడా టీమిండియా దగ్గర లేదని బాంబు పేల్చారు. తమను నిలకడగా ఓడించలేక చాలాసార్లు టీమిండియా ఓడిపోయిందని గుర్తు చేశారు. అప్పుడప్పుడు ప్రపంచ కప్ టోర్నమెంట్స్ లో పాకిస్తాన్ పైన టీమిండియా గెలిచేది కావచ్చు… చాలా సందర్భాలలో సిరీస్ మాత్రం పాకిస్తాన్ ( Pakistan Team) చేతిలో ఇండియా ( Team India) కోల్పోయేది అంటూ హేళన చేశారు.
తమను క్రమం తప్పకుండా ఓడించగల స్థాయి టీమిండియా దగ్గర లేదన్నారు. కానీ మొత్తం హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే… పాకిస్తాన్ సుమారు 150 మ్యాచ్ ల ఆధిక్యం ఉండాల్సిందేనని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ కేవలం ఏడు మ్యాచ్ లు ఆధిక్యంలో ఉండడం చాలా దారుణమన్నారు. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ఎక్కువగా విజయాలను నమోదు చేయలేక సతమతమవుతుందని ఫైర్ అయ్యారు మహమ్మద్ యూసఫ్ (Mohammad Yousuf).
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs. Pakistan) మధ్య ఇప్పటి వరకు 212 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో వన్డేలు, టి20 లు అలాగే టెస్టులు కూడా ఉన్నాయి. ఇలా మొత్తంగా 212 మ్యాచ్ లు జరిగితే.. టీమిండియా 81 విజయాలు నమోదు చేసుకుంది. పాకిస్తాన్ 88 విజయాలు నమోదు చేయడం జరిగింది. వన్డేలు 136 జరిగితే… 58 మ్యాచ్ లలో ఇండియా గెలిస్తే… పాకిస్తాన్ 73 మ్యాచ్ లలో గెలిచింది. టెస్టుల్లో ఇండియా తొమ్మిది గెలిస్తే పాకిస్తాన్ 12 మ్యాచ్ లలో విక్టరీ సాధించింది. ఇక టి20 లో మాత్రం టీమిండియా పై ( TEam India) చేయి సాధించింది. ఇందులో టీమిండియా 17 గెలిస్తే.. మూడింటిలో పాకిస్తాన్ విజయం సాధించింది.
Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భయ్యా…కోహ్లీని, నన్ను బండబూతులు తిట్టాడు