Wahab Riaz Dating With Eyman Fatima: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) నేపథ్యంలో సెమీ ఫైనల్ దాకా వచ్చిన పాకిస్తాన్ జట్టు ఎలిమినేట్ అయింది. రెండో సెమీ ఫైనల్స్ సందర్భంగా పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక (Pakistan vs. Sri Lanka) ఉమెన్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో చెత్త ప్రదర్శన కనబరిచి.. ఇంటి దారి పట్టింది ఉమెన్స్ పాకిస్తాన్ టీం. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పాకిస్తాన్ మహిళల కోచ్ వహాబ్ రియాజ్ (Wahab Riaz ), లేడీ క్రికెటర్ ఐమాన్ ఫాతిమా (Eyman Fatima) ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరూ స్టేడియంలోనే రొమాన్స్ చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.
ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) నేపథ్యంలో కోచ్ వహాబ్ రియాజ్ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. వహాబ్ రియాజ్ పెద్ద కామాంధుడని.. కోచ్ గా అస్సలు పనికిరాడు అని విమర్శలు వస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించేవాడని పోస్టులు కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగానే వహాబ్ రియాజ్ బాగోతం బయట పడింది. అయినప్పటికీ అతడినే కోచ్ గా కొనసాగిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీనికి రాజకీయ సమీకరణాలు తోడైన నేపథ్యంలో.. వహాబ్ రియాజ్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ టచ్ చేయడం లేదని అంటున్నారు.
ఇంతలోనే ఫాతిమాతో మనోడు డేటింగ్ లో ఉన్నట్లు మరో న్యూస్ బయటకు వచ్చింది. ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఇప్పటివ రకు ఈ ఇద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటోలను వైరల్ చేస్తున్నారు. స్టేడియంలో కూడా ఇద్దరు ఒంటరిగా మాట్లాడుకుంటూ.. కాస్త రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో మళ్లీ కోచ్ వహాబ్ రియాజ్ ను ఉద్దేశించి పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. వీడు కోచ్ కాదు.. కామాంధుడు అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ హెడ్ కోచ్ వహాబ్ రియాజ్ ను తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ జట్టును నాశనం చేస్తాడని ఫైర్ అవుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని కోరుతున్నారు.
https://twitter.com/Qamar5618/status/2098678367356879218