Tanveer Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టును మరింత మెరుగుపరిచేందుకుగాను అనేక చర్యలు తీసుకుంటోంది PCB. ఇప్పటికే హిట్టర్ల కోసం స్పెషల్ గా అమెరికాలో ట్రైనింగ్ ఇస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఇక ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పాకిస్తాన్ ప్లేయర్ల ఇంగ్లీష్ భాష మెరుగుపడేందుకు గాను చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ ప్లేయర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ( English-speaking classes for Pakistan players) నిర్వహించనుంది PCB. అయితే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ల పైన రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులను ఆహ్వానిస్తుంటే.. మరి కొంతమంది విమర్శిస్తున్నారు. క్రికెట్ నేర్పించాలి కానీ… చిన్నపిల్లల లాగా… స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు అవసరమా ? అంటూ నిలదీస్తున్నారు.
Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది
పాక్ ప్లేయర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఇప్పించడంపై మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) తన స్టైల్ లో స్పందించారు. పాకిస్తాన్ క్రికెటర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులతో పాటు… మెంటల్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కూడా అందించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంతమంది క్రికెటర్లు అప్పుడప్పుడు పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తారని.. అలాంటి వారిని గుర్తించి, పిచ్చాసుపత్రిలో చూపించాలంటూ చురకలు అంటించారు. అదే సమయంలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులను ఆయన స్వాగతించారు.
పాకిస్తాన్ ప్లేయర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఇప్పించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తన్వీర్ అహ్మద్, దాంతోపాటు ఫిట్నెస్ పైన కూడా శ్రద్ధ పెట్టాలని కోరారు. ఇంగ్లీష్ క్లాసుల కంటే పాకిస్తాన్ క్రికెటర్లకు ఫిట్నెస్ పరీక్షలు చాలా ముఖ్యమన్నారు. ఆ దిశగా కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడుగులు వేయాలన్నారు. ఇక ఇంగ్లీష్ క్లాసులు ఇప్పించడం వల్ల అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాకిస్తాన్ ప్లేయర్లు మెరుగ్గా మాట్లాడగలుగుతారని వివరించారు. ఇకపై పాకిస్తాన్ ఇంగ్లీష్ పై ఎవరు కూడా ట్రోలింగ్ చేయబోరని స్పష్టం చేశారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పాకిస్తాన్ క్రికెటర్లకు లాహోర్ లోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఫ్రీ సీజన్ క్యాంప్ లో ప్రత్యేకంగా ఇంగ్లీష్ క్లాసులు ( English-speaking classes for Pakistan players) ఇప్పిస్తున్నారు. ఈ సందర్భంగా మెంటల్ కండిషనింగ్ సెషన్లను కూడా తాజాగా ప్రారంభించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ప్రతిరోజు గంట పాటు పాకిస్తాన్ ప్లేయర్ లందరికీ ఈ సెషన్ ఉండనుందట. ఈ క్లాసులకు ప్రతీ ఒక్కరూ హాజరుకావాల్సిందేనని కుండ బద్దలు కొట్టి చెప్పింది పీసీబీ.