E-Paper
Advertisement

నితీశ్ రెడ్డి భారీ సిక్స‌ర్‌…కిస్సు ఇచ్చిన‌ లేడీ ఫ్యాన్, అదృష్ట‌మంటే మ‌న తెలుగోడిదేరోయ్

నితీశ్ రెడ్డి భారీ సిక్స‌ర్‌…కిస్సు ఇచ్చిన‌ లేడీ ఫ్యాన్, అదృష్ట‌మంటే మ‌న తెలుగోడిదేరోయ్
Advertisement

A Lady fan kisses the ball hit By Nitish Kumar Reddy: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) మధ్య జరిగిన నాలుగో టీ20 సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిపై ( Nitish Kumar Reddy ) ఓ లేడీ అభిమాని ముద్దుల వర్షం కురిపించింది. 4వ టీ20 సంద‌ర్భంగా నితీశ్‌ భారీ సిక్సర్ బాదాడు. దీంతో బంతి నేరుగా గ్యాలరీలో ఉన్న లేడీ అభిమానికి బంతి తగిలింది. ఈ క్రమంలో ఆ బంతి తీసుకున్న సదరు లేడి.. దానికి ఒక కిస్ ఇచ్చి మరీ గ్రౌండ్ లోకి విసిరిసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై క్రికెట్ ల‌వ‌ర్స్ ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి ఆ అమ్మాయి బంతితో ప్ర‌పోజ్ చేసింద‌ని కొంద‌రు అంటుంటే, నితీశ్ కు ఎక్క‌డికి వెళ్లినా, ఇదే రేంజ్ ఫాలోయింగ్ ఉంటోంద‌ని మ‌రి కొంద‌రు రియాక్ట్ అవుతున్నారు.

ఒత్తిడిలో రాణించ‌లేడంటూ నితీశ్ కుమార్ రెడ్డిపై ట్రోల్స్‌

తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి పై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. హార్దిక్ పాండ్యా స్థానంలో టీమిండియాలోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి ఒత్తిడి సమయంలో రాణించలేకపోతున్నాడని పరువు తీస్తున్నారు. పేరుకే ఆల్ రౌండర్ కానీ బౌలింగ్ సరిగ్గా వేస్తే బ్యాటింగ్ చేయలేడ‌ని.. బ్యాటింగ్ లో ఇరగదీస్తే బౌలింగ్ లో తేలిపోతాడని చురకలు అంటిస్తున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన కీలక 4వ మ్యాచ్ లో 21 పరుగులకే నితీశ్ కుమార్ రెడ్డి వికెట్ సమర్పించుకున్నాడు. తిలక్ వర్మ తో పాటు పోరాడడంలో నితీశ్ కుమార్ రెడ్డి విఫలమయ్యాడు. దీంతో అతన్ని దారుణంగా ఆడుకుంటున్నారు. తిలక్ తో క‌లిసి ఇన్నింగ్స్ బిల్డ‌ప్ చేసింటే హీరో అయ్యేవాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

87 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయిన టీమిండియా

న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య ఆక్లాండ్ వేదికగా నాల్గవ టి20 జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమైన ఈ టి20 నేపథ్యంలో ఎప్పటిలాగే టీం ఇండియానే టాస్ గెలిచింది. మొదట బౌలింగ్ చేసేందుకు మొగ్గు చూపింది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 259 పరుగులు సాధించింది. గ్లెన్ ఫిలిప్స్ సెంచరీతో దుమ్ము లేపాడు. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. తిలక్ వర్మ ఒక్కడే 35 పరుగులతో హైయెస్ట్ రన్స్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన వాళ్ళందరూ చేతులెత్తయడంతో 87 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

 

 

?utm_source=ig_web_copy_link&exln=NTc4MTIwNjQ2YQ==

Related News

టీమిండియాను ఓడించిన ప్లేయర్లకు బిర్యానీ పార్టీ…? పాక్ ప్రధాని షరిఫ్‌పై ట్రోలింగ్ షురూ!

అభిషేక్, వైభవ్, ఇషాన్‌లను వన్డేల్లోకి తీసుకోండి..ఆ రాక్షసులు భూకంపం సృష్టిస్తారు

గంభీర్ బుర్ర తక్కువ నిర్ణయాల వల్లే 4వ టీ20లో టీమిండియా ఓటమి..గవాస్కర్ ఫైర్

పాకిస్తాన్ ప్లేయ‌ర్ తో SRH బౌల‌ర్ న‌ట‌రాజ‌న్‌ దోస్తానా..దేశం నుంచి త‌రిమేయాలంటూ ట్రోల్స్‌!

రాహుల్, కృనాల్ డకౌట్…పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి

కాగితంపై రాసి పెట్టుకోండి..2027 వ‌రల్డ్ క‌ప్‌ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ తీసుకు వ‌స్తారు

Hong Kong Sixes 2026:  యూఏఈ చేతిలో పాకిస్తాన్ ఘోర‌ ఓట‌మి

Big Stories

Advertisement
×