E-Paper
Advertisement

Tanveer Ahmed: ఛీ..ఛీ, ఇంత దారుణ‌మా..? అది ఐపీఎల్ కాదు, ఫిక్సింగ్ సూప‌ర్‌ లీగ్

Tanveer Ahmed: ఛీ..ఛీ, ఇంత దారుణ‌మా..? అది ఐపీఎల్ కాదు, ఫిక్సింగ్ సూప‌ర్‌ లీగ్
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక వివాదం రాజు కుంటూనే ఉంది. ఇప్పటికే అంపైర్ల తప్పుడు నిర్ణయాలు, వివాదాస్పద క్యాచ్ లు హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో ప్రతి మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు కూడా చేస్తున్నారు అభిమానులు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) హాట్ కామెంట్స్ చేశారు. కేకేఆర్ వర్సెస్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్లో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు. ఫిన్ అలెన్ ( Finn Allen) నాటౌట్ అని.. దిగ్వేష్ సింగ్ ( Digvesh singh) బౌండరీ టచ్ చేసి క్యాచ్ అందుకున్నాడని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. అంపైర్లు అమ్ముడుపోవడం వలన OUT ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Mukul Choudhary: ల‌క్నోలో మ‌రో ధోని, హెలిక్యాప్ట‌ర్ కొట్టి కేకేఆర్ ను చిత్తు చేశాడు..ఎవ‌రీ ముకుల్ చౌదరి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు, అది సూపర్ ఫిక్సింగ్ లీగ్ – తన్వీర్ సంచలనం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న కేకేఆర్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్లమధ్య 15వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరివరకు పోరాడిన కేకేఆర్, అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల బలైపోయింది. ముఖ్యంగా ఫిన్ అలెన్ క్యాచ్ ను దిగ్వేష్ సింగ్ క్యాచ్ అందుకోగా.. అంపైర్లు సరిగ్గా చూడక ఔట్ ఇచ్చారు. వాస్తవంగా బౌండరీ లైన్ తొక్కిమరి క్యాచ్ అందుకున్నాడు దిగ్వేష్ సింగ్. రీప్లే లో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఈ తరుణంలో క్యాచ్ వివాదంగా మారింది.

అయితే ఈ ఘటనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ ( Tanveer ahmed) అహ్మద్ సీరియస్ అయ్యారు. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కాదని.. సూపర్ ఫిక్సింగ్ లీగ్ అంటూ ఆరోపణలు చేశారు. ప్రతి మ్యాచ్ లో ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయని గుర్తు చేశారు. రీప్లై లో క్లియర్ కట్ గా కనిపించినా కూడా అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. దీని వల్ల గెలవాల్సిన జట్టు ఓడిపోతుందని మండిపడ్డారు. అంపైర్లు డబ్బులు తీసుకోవడం కారణంగా ఈ పరిస్థితి నెలకొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు తన్వీర్ అహ్మద్.

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ చాలా నయం అంటూ బాoబు పేల్చారు. తమ దగ్గర ఎలాంటి ఫిక్సింగ్ లేదని.. కేవలం ఐపిఎల్ టోర్నమెంట్లో మాత్రమే ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించారు. ఇలాంటి క్రమంలో విదేశీ క్రికెటర్లు అందరూ ఐపీఎల్ టోర్నమెంట్ ను వదిలేసి, పాకిస్తాన్ సూపర్ లీగ్ లో టోర్నమెంట్లో అడుగుపెట్టాలని కోరారు. అలా జరిగితే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు మరింత పాపులారిటీ పెరుగుతుందని వ్యాఖ్యానించారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అంపైర్లు తీసుకుంటున్న నిర్ణయాలపై మన భారతీయ మాజీ క్రికెటర్లు కూడా సీరియస్ అవుతున్నారు.

 

Also Read: KKR VS LSG: అంతా ఫిక్సింగే..రెండు క్యాచ్ లు వివాదం, ఫిన్ అలెన్‌, ర‌హానే ఇద్ద‌రూ నాటౌటే !

?igsh=anhibDF2bmNqcTRt

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×