E-Paper

Tanveer Ahmed: బాబ‌ర్ గురించి రోనాల్డో ప‌దే ప‌దే నాకు ఫోన్ చేసి విసిగిస్తాడు

Tanveer Ahmed: బాబ‌ర్ గురించి రోనాల్డో ప‌దే ప‌దే నాకు ఫోన్ చేసి విసిగిస్తాడు
Advertisement

Tanveer Ahmed:  పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, టీమిండియా పై విమర్శలు చేస్తూనే ఉంటాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి, ఫిక్సింగ్ జరిగిందంటూ అనేక ఆరోపణలు చేశారు తన్వీర్ అహ్మద్. అలాగే టీమిండియా ఎక్కడ గెలిచినా, తొండాట ఆడి గెలిచిందని మీడియా ముందుకు వచ్చి వాగుతూ ఉంటాడు. ఇక వైభవ్ సూర్యవంశీ గురించి అయితే, తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కాదు. అసలు వీడు ఇండియా పై విమర్శలు చేయడానికి పుట్టాడనే అనిపిస్తుంది. అంతలా కుట్రలకు తెర లేపుతున్నాడు తన్వీర్ అహ్మద్. అలాంటి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ తాజాగా బాబర్ ఆజం ( Babar Azam), క్రిస్టియానో రోనాల్డో ( Cristiano Ronaldo ) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబర్ ఆజం గురించి తెలుసుకునేందుకు పదేపదే క్రిస్టియానో రోనాల్డో తనకు ఫోన్ చేస్తాడని బాంబు పేల్చారు. ఈ మేరకు తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

బాబ‌ర్ గురించి రోనాల్డో ప‌దే ప‌దే నాకే ఫోన్ చేసి విసిగిస్తాడు

Advertisement

పొద్దున లేస్తే ఇండియా పై విమర్శలు చేసే పాకిస్తాన్ మాజీ క్రికెట్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రిస్టియానో రోనాల్డో, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఇద్దరు స్నేహితులని వెల్లడించారు. కానీ ఒకరిని ఒకరు మాట్లాడుకోరని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బాబర్ ఆజం బాగోగుల గురించి పదే పదే క్రిష్టియానో రోనాల్డో తనకు ఫోన్ చేసి విసిగిస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వాళ్ళ స్నేహం మాత్రం చాలా గొప్పదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్లు… సరైన దేశాలకు ప్రాతినిధ్యం వహించడం లేదని బాంబు పేల్చారు. ఇద్దరు ఒకే దేశానికి ఆడితే, బాగుండేదని వ్యాఖ్యానించారు తన్వీర్ అహ్మద్.

దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై నెటిజెన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఒరేయ్ మీ బాబర్ ఆజం పేరైన క్రిస్టియానో రోనాల్డో విని ఉంటాడా ? అసలు పాకిస్తాన్ దేశం ఉందనే విషయం ఆయనకు తెలుసా ? అంటూ ర్యాగింగ్ చేస్తున్నారు. మొన్నటి వరకు టీమిండియా క్రికెటర్లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పై విషం కక్కావు కదా…? ఇప్పుడు క్రిస్టియానో రోనాల్డో పైన పడిపోయావా అంటూ పరువు తీస్తున్నారు. ముందుగా మీ పాకిస్తాన్ క్రికెటర్లు సరిగ్గా ఆడడం నేర్చుకోమను… ఇండియా పై గెలిచి చూపించమను అంటూ చురకలు అంటిస్తున్నారు.

Advertisement

Also Read: Kumar asangakkara On vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

 

 

Related News

Javed Miandad: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు రా నాయ‌నా, అంద‌రినీ ఫూల్స్ చేసి గేమ్స్ ఆడుతున్నాడు

ఒరేయ్ గంభీర్..నీకు అస‌లు బుర్ర ఉందా? గిల్ ను ఓపెన‌ర్ గా ఎందుకు పంప‌లేదు

ఐపీఎల్ 2027 షెడ్యూల్ వ‌చ్చేసింది, ఈ సారి15 రోజులు ముందుగానే

బాబ‌ర్‌, గుల్ ఫిరోజా ఇద్ద‌రు పాకిస్తాన్ కు ప‌ట్టిన చీడ ప‌రుగులు..లైవ్ డిబేట్ లో ప‌రువు తీసిన క‌మ్రాన్‌

Ind vs Afg: ముఠా మేస్త్రిలాగా మెడ‌లో గిల్ వేసుకున్న‌ తెల్ల‌టి గుడ్డ ఏంటి?

పాకిస్తాన్ కొంప‌ముంచిన ర‌నౌట్…ఫాతిమా కోసం నష్రా సంధు త్యాగం

క‌ళ్ల జోడు పెట్టుకుని గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్…బౌన్స‌ర్ తో తిక్క కుదిర్చిన ఆర్చ‌ర్

×