E-Paper

షాకింగ్ సర్ప్రైజ్.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ‘స్పైడర్‌మ్యాన్’ కపుల్!

షాకింగ్ సర్ప్రైజ్.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ‘స్పైడర్‌మ్యాన్’ కపుల్!
Advertisement

Tom Zendaya: హాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్, గ్లోబల్ వైడ్‌గా మిలియన్ల మంది గుండెల్లో ‘పీటర్ పార్కర్ – మేరీ జేన్’గా నిలిచిపోయిన టామ్ హాలండ్, జెండయా తమ రిలేషన్‌షిప్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న రూమర్స్‌ నిజమేనని తేల్చేస్తూ.. తాము ఇద్దరం పెళ్లి బంధంతో ఒకటయ్యామని ఈ లవ్లీ కపుల్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఆరంభంలోనే అత్యంత రహస్యంగా, కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగినట్లు టామ్ హాలండ్ ఓ అంతర్జాతీయ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

మార్వెల్ ఫ్యాన్స్‌కి బిగ్ సర్ప్రైజ్

2016లో వచ్చిన ‘స్పైడర్‌మ్యాన్: హోమ్‌కమింగ్’ సెట్స్‌లో వీరిద్దరి పరిచయం ఏర్పడగా, ఆ తర్వాత వచ్చిన ‘ఫార్ ఫ్రమ్ హోమ్’, ‘నో వే హోమ్’ చిత్రాలతో వీరి కెమిస్ట్రీ స్క్రీన్ పైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ ఓ రేంజ్‌లో వర్కవుట్ అయింది. చాలా కాలం పాటు తమ లవ్ లైఫ్‌ను మీడియా కంటికి పడకుండా సీక్రెట్‌గా మెయింటైన్ చేసిన ఈ జంట.. ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్‌కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.

Advertisement

Also read :సెక్యూరిటీలో ‘మహిళా బౌన్సర్’.. తలపతి విజయ్ క్రేజీ డెసిషన్ వైరల్

మా వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికే మేము ఇష్టపడ్డామని, కుటుంబ సమక్షంలో చాలా ప్రశాంతంగా మా పెళ్లి జరిగిందని చెబుతూ.. జెండయాతో తన లైఫ్ ప్రయాణం చాలా సంతోషంగా సాగుతోందని టామ్ హాలండ్ భావోద్వేగానికి లోనయ్యారు.

క్రేజీ మీమ్స్‌తో సందడి చేస్తున్న నెటిజన్లు

Advertisement

ఈ లవ్లీ కపుల్ మ్యారేజ్ న్యూస్ బయటకు రాగానే సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో #TomDaya, #SpidermanWedding అనే హ్యాష్‌ట్యాగ్‌లు టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. మార్వెల్ ఫ్యాన్స్, హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. రీల్ లైఫ్ పీటర్ పార్కర్.. రియల్ లైఫ్‌లో ఎట్టకేలకు తన ఎమ్‌జె (MJ)ని సొంతం చేసుకున్నాడంటూ క్రేజీ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు నెటిజన్లు .

కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం

పెళ్లి తర్వాత కూడా ఈ క్రేజీ కపుల్ వెండితెరపై ప్రేక్షకులను అలరించడానికి సరికొత్తగా సిద్ధమవుతున్నారు. త్వరలోనే రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) లో ఈ ఇద్దరూ మరోసారి కలిసి నటిస్తుండటం విశేషం.

Also read :మెగాస్టార్ 158 సెట్స్ లోకి ఎంట్రీ.. భారీ అంచనాలు, అంతకుమించిన అనుమానాలు!

‘నో వే హోమ్’ ఎండింగ్‌లో పీటర్ పార్కర్‌ని జెండయా మర్చిపోగా, మరి ఈ కొత్త పార్ట్‌లో ఆమెకు గతం ఎలా గుర్తొస్తుంది, వీరిద్దరి లవ్ స్టోరీ ఎలా మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రియల్ లైఫ్ కపుల్ క్రేజ్ తో పాటు సరికొత్త మల్టీవర్స్ స్టోరీలైన్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

కృతి శెట్టితో శంకర్ కొడుకు రొమాన్స్.. ‘లవర్ బాయ్’గా అర్జిత్ గ్రాండ్ ఎంట్రీ!

మణికొండ మొత్తం కొనేసేవాడిని.. ఓవర్ కాన్ఫిడెన్స్ ముంచేసింది.. ‘చిత్రం’ శ్రీను షాకింగ్ కామెంట్స్!

సెక్యూరిటీలో ‘మహిళా బౌన్సర్’.. తలపతి విజయ్ క్రేజీ డెసిషన్ వైరల్

మెగాస్టార్ 158 సెట్స్ లోకి ఎంట్రీ.. భారీ అంచనాలు, అంతకుమించిన అనుమానాలు!

ఆ హిట్ సినిమా రీమేక్ ? అనిల్ రావిపూడి కొత్త సినిమా కథపై సరికొత్త లీక్స్ !

నజ్రియా కొంపముంచిన సెన్సేషనల్ పోస్ట్.. ఆ ఒక్క మాటతో బుక్కయిపోయిందా?

రామ్ చరణ్ ప్రేమను పరీక్షించిన ఉపాసన.. కార్ తలుపులు బాదిన జనాలు!

×