E-Paper
Advertisement

నలుగురిలో ఉన్నా.. దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? అసలు కారణం ఇదే!

నలుగురిలో ఉన్నా.. దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? అసలు కారణం ఇదే!
Advertisement

Mosquito Bites: ఎక్కడికి వెళ్లినా.. దోమలు తమనే టార్గెట్ చేస్తున్నాయన్న అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. నలుగురితో ఉన్నప్పడు వారందరినీ వదిలేసి.. తమనే వెతికి మరీ కుడుతున్నాయని పలువురు చెబుతుంటారు. ‘నా రక్తం తీపి ఏమో, అందుకే దోమలు నన్నే కుడుతున్నాయి’ అని సరదా కామెంట్స్ కూడా చేస్తుంటారు. అయితే కొందరి పట్ల దోమలు ‘అయస్కాంతం’ (Mosquito Magnet) లాగా ఆకర్షితం కావాడం వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో దోమలు కొందరిపైనే ఎందుకు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాయో వెల్లడైంది. ఆ వివరాలు మీకోసం..

ఆ నాలుగే కారణమట..!

ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ డెవలప్‌మెంట్‌కు చెందిన ఎంటమాలజిస్ట్ ఫ్రెడరిక్ సీమార్ట్.. దోమలపై జరిపిన అధ్యయనంలో కీలక విషయాలను కనుగొన్నారు. శరీర దుర్వాశన, వేడి, కార్బన్ డయాక్సైడ్, చర్మం నుండి విడుదలయ్యే కొన్ని రకాల వాసనలకు ప్రధానంగా దోమలు అట్రాక్ట్ అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఆకర్షణ బలం ఎల్లప్పుడూ దోమల్లో ఒకే విధంగా ఉంటుందని చెప్పలేమన్నారు. కాలక్రమేణా వాటిలో మార్పులు సైతం రావొచ్చని అంచనా వేశారు.

100 మీటర్ల దూరం నుంచే..

Advertisement

అయితే దోమలను ఆకర్షించే వాటిలో ప్రధానమైనది కార్బన్ డయాక్సైడ్ అని స్వీడన్ పరిశోధకుడు రికార్డ్ ఇగ్నైల్ పేర్కొన్నారు. ముందుగా కార్బన్ డయాక్సైడ్ ను ద్వారా ఆకర్షణకు గురై దగ్గరకు వచ్చే కొద్ది.. శరీర దుర్వాశన, బాడీ టెంపరేచర్, తేమను గ్రహించడం ప్రారంభిస్తాయని ఆయన పేర్కొన్నారు. మనిషి విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ ను 100 మీటర్ల దూరం నుంచే దోమలు పసిగట్టగలవని ఆయన పేర్కొన్నారు. డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధిని వ్యాప్తి చేసే ఏడెస్ ఈజిప్టి అనే దోమలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని ఆయన చెప్పుకొచ్చారు.

మద్యం సేవించేవారంటే ఇష్టమట!

ఈ ప్రయోగాన్ని మెుత్తం 42 మంది మహిళలపై ఇగ్నైల్ నిర్వహించారు. చర్మం నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తున్న వారి పట్ల దోమలు ఆకర్షింపబడటాన్ని ఆయన గుర్తించారు. అందులోనూ తరుచూ మద్యం సేవించే వారి వద్దకు దోమలు ఎక్కువగా వెళ్తున్నట్లు పరిశోధనలో తేలింది. మరీ ముఖ్యంగా బీర్లు తాగేవారు.. దోమల బాధిత జాబితాలో ముందు వరుసలో ఉన్నట్లు ఇగ్నైట్ చెప్పుకొచ్చారు. బుర్కినా ఫాసోలో నిర్వహించిన మరో అధ్యయనంలో మలేరియాను వ్యాప్తి చేసే అనోఫెలేస్ దోమలు నీరు తాగిన వారికంటే.. బీరు తాగేవారినే అధికంగా కుడుతున్నట్లు తేలింది.

Advertisement

Also Read: ఒరిజినల్ నెంబర్ హైడ్.. డూప్లికేట్ నెంబర్‌తో రీఛార్జ్.. BSNL క్రేజీ టెక్నాలజీ!

మరి తప్పించుకోవడం ఎలా?

శరీరం విడుదల చేసే వాసనలను మార్చలేము కానీ దోమల బారి నుంచి తప్పించుకోవడానికి కొన్ని మార్గాలను మాత్రం నిపుణులు సూచిస్తున్నారు. డీట్ (DEET), పికారిడిన్ (Picaridin) వంటి దోమల నివారణ మందులతో వాటి నుంచి తప్పించుకోవచ్చని పేర్కొంటున్నారు. అలాగే శరీరం పూర్తిగా కప్పబడేలా ఉండే లేత రంగు దుస్తులను ధరిస్తే మంచిదని హితవు పలుకుతున్నారు. సాయంత్రం వేళల్లో ఇళ్ల కిటికీలు, తలుపులు మూసి ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దోమ కాటుకు గురికాకుండా ఉండొచ్చని తెలియజేస్తున్నారు.

Also Read: కూలర్ + ఎగ్జాస్ట్ ఫ్యాన్.. క్రేజీ కాంబినేషన్ భయ్యా.. బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

Related News

సూర్యాస్తమయం చూస్తే నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిద్ర, మూడ్ మెరుగవుతాయా?

స్టైలిష్ లుక్,సూపర్ ఫీచర్లు..బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్!

మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

మలవిసర్జన సమయంలో రక్తం వస్తోందా? అది పైల్స్ అనకుంటే మీరు పొరబడునడినట్లే

చిన్న వయసులోనే పేరు, గుర్తింపు పొందుతారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి అతిత్వరగా విజయాలు సాధిస్తారు

మంచి వ్యక్తుల ఈ అలవాట్లే వారి బలహీనతలు.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?

ఆఫీస్ డెడ్‌లైన్లు, మీటింగ్‌లతో సతమతమవుతున్నారా? స్ట్రెస్ తగ్గేందుకు 5 నిమిషాలు ఇలా చేయండి!

వాడిన టీ బ్యాగ్స్ పారేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే.. వాటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Big Stories

Advertisement
×