E-Paper
Advertisement

T20 World Cup 2024: T20 వరల్డ్ కప్‌లో భారత్ బోణి

T20 World Cup 2024: T20 వరల్డ్ కప్‌లో భారత్ బోణి
Advertisement

T20 world cup 2024: T20 వరల్డ్ కప్‌లో భారత్ బోణి కొట్టింది. బుధవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా టీమిండియా న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడింది. మొదటగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో ఐర్లాండ్ బ్యాటింగ్ చేసి 96 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో స్వల్ప స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. పూర్తిగా 20 ఓవర్లు ఆడకుండా కేవలం 16 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆల్ రౌండర్ హార్ధిక పాండ్యా ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 3 వికెట్లతో చెలరేగాడు.

Advertisement

ఇటు ఐర్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే.. గారెత్ డెలానీ ఒక్కడే అత్యధికంగా 26 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా కూడా కేవలం 20 లోపు మాత్రమే పరుగులు తీశారు. ఓపెనర్లుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆండీ బల్బిర్నీ కేవలం 5 పరుగులు తీశాడు. పాల్ స్టిర్లింగ్ 2 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో వారు శుభారంభాన్ని అందించలేకపోయారు. ఆ తరువాత బ్యాటింగ్ చేసినటువంటి టక్కర్ 10 పరుగులు తీశాడు. కర్టిస్ కాంఫర్ 12 పరుగులు తీశాడు. జార్జ్ డాక్రెల్ 3 పరుగులు తీశాడు. మార్క్ అడైర్ 3 పరుగులు తీశాడు. జోష్ లిటిల్ 14 పరుగులు తీయగలిగాడు.

Also Read: రిపోర్టర్ ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన కెప్టెన్ రోహిత్

Advertisement

టీమిండియా బౌలర్ల విషయానికి వస్తే.. హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. ఆ తరువాత అర్ష్ దీప్ సింగ్, బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ సాధించగలిగారు.

Tags

Related News

కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

Big Stories

Advertisement
×