BigTV English

Rohit Sharma: అతనే ఇండియా పతనాన్ని శాసించాడు: రోహిత్ శర్మ

Rohit Sharma: అతనే ఇండియా పతనాన్ని శాసించాడు: రోహిత్ శర్మ

Rohit sharma on India vs Srilanka match(Sports news headlines): గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయామని, అది ఒకే ఒక్కడి వల్ల జరిగిందని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ శ్రీలంక స్పిన్నర్ జెఫ్రె వండర్సే(6/33) అసాధారణ బౌలింగ్‌తో తమ పతనాన్ని శాసించాడని చెప్పాడు. అదీకాక బ్యాటింగులో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ మిస్ అయ్యిందని అన్నాడు. అది ఉంటే, ఓవర్ లో ఒకట్రెండు అయినా లూజ్ బాల్స్ పడతాయని, అవి కొడుతూ వెళితే మ్యాచ్ గెలవడం సులువు అయ్యేదని తెలిపాడు.


టాస్ ఓడిపోవడం కూడా కీలకంగా ఉందని తెలిపాడు. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మిడిల్ ఓవర్లలో పిచ్ ఓవర్ స్పిన్ అవుతోందని అన్నాడు. అందుకే తొలి 10 ఓవర్లలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడం ముఖ్యమని తెలిపాడు.

ఇకపోతే, మ్యాచ్ ఓడిపోతే ఎవరికైనా బాధగా, నిరాశగా ఉంటుందని అన్నాడు. కాకపోతే ఈ రోజు మేం రాణించలేకపోయాం. ఇది ఒప్పుకొని తీరాల్సిందేనని తెలిపాడు. ఈ ఒక్క వైఫల్యాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదన్నాడు.


చివరిగా మిడిలార్డ్ వైఫల్యంపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రోహిత్ శర్మ అన్నాడు. ఈ మాటలను బట్టి చూస్తే విరాట్, రాహుల్, శ్రేయాస్ వీరిని ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు. లేదంటే ఈ సీక్వెన్స్ ను మార్చడమా? ఇకపోతే కొత్తవారికి అవకాశం ఇవ్వడమో చేస్తారని చెబుతున్నారు.
నెటిజన్లు ఏమంటున్నారంటే, గౌతంగంభీర్ కోరుండి సీనియర్లను పిలిపించుకున్నాడు. పడుకున్నోళ్లని లేపాడు. వారికింకా నిద్రమత్తు వదల్లేదని అంటున్నారు. నిజానికి శ్రీలంక పర్యటనకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, బుమ్రా లాంటి వాళ్లు రెస్ట్ అడిగారు.
బుమ్రాకి మేనేజ్మెంట్ ఇచ్చింది. కాకపోతే సీనియర్లు ఇద్దరిని రమ్మని పిలిచారు. రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడు. కొహ్లీ మళ్లీ చేతులెత్తేస్తున్నాడు. టీ 20 ప్రపంచకప్ లో ఇలాగే ఆడి, చివర ఫైనల్ లో ఆడి పరువు కాపాడుకున్నాడు. మళ్లీ శ్రీలంకలో కూడా పాత ధోరణిలోనే వెళుతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి రోహిత్, గౌతం గంభీర్ తర్వాత మ్యాచ్ కి ఏం మార్పులు చేస్తారో చూడాల్సిందే.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×