BigTV English

AAY Trailer: ఎన్టీఆర్ బామ్మర్ది ‘ఆయ్’ ట్రైలర్ రిలీజ్.. నవ్వులే నవ్వుల్

AAY Trailer: ఎన్టీఆర్ బామ్మర్ది ‘ఆయ్’ ట్రైలర్ రిలీజ్.. నవ్వులే నవ్వుల్

AAY Trailer: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లో అవకాశాల కోసం చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్క అవకాశం వస్తే తమ టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలని కళలు కంటారు. అలాంటి అవకాశం వస్తే డెఫనెట్‌గా వారు అనుకున్నది సాధించి మంచి గుర్తింపు సంపాదించుకుంటుంటారు. హీరోలుగా, సైడ్ క్యారెక్టర్లుగా, కమెడియన్లుగా తమ టాలెంట్‌తో అదరగొట్టేస్తుంటారు. మరికొందరు ఇండస్ట్రీలో పలుకుబడితో ఎంట్రీ ఇస్తుంటారు. కొత్త కొత్త సినిమాలు తీసి హిట్లు కొడుతుంటారు. అలాంటి వారిలో నార్నే నితిన్ ఒకడు.


యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమర్దిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తీసిన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ‘మ్యాడ్’ అంటూ నిజంగానే సినీ ప్రియుల్లో సరికొత్త మ్యాడ్‌నెస్ క్రియేట్ చేశాడు. కొత్త దర్శకుడు కల్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాతో నార్నే నితిన్ ఎన్టీఆర్ బావమర్ది కంటే.. మ్యాడ్ మూవీలో అశోక్‌గా అందరికీ గుర్తుండిపోయాడు.

Also Read: ఎన్టీఆర్ బావమరిది రెండో సినిమా ‘ఆయ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?


ఒక చిన్న సినిమాగా వచ్చిన మ్యాడ్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ మూవీలో నటించిన నటులకు మంచి గుర్తింపు కూడా లభించింది. ఇందులో బాగంగానే ఒక్కొక్కరూ ఒక్కో మూవీతో ఫుల్ బిజీ అయిపోయారు. అందులో నార్నే నితిన్ ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై ‘ఆయ్’ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుంది.

అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఓ అందమైన లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన అత్యంత గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయ్ మూవీ నుంచి పలు అప్డేట్‌లు ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడులైన పోస్టర్లు, సాంగ్స్, గ్లింప్స్ అంచనాలు పెంచేశాయి. ఇక ఇవాళ మరో అప్డేట్ అందించారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యేలా అనిపిస్తుంది. ట్రైలర్ మొత్తం ఫన్నీ ఫన్నీగా ఉంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×