T20 World Cup: గతేడాది టి-20 ప్రపంచ కప్ ను గెలిచి కోట్లాదిమంది అభిమానుల కలను నెరవేర్చింది భారత జట్టు. లీగ్ దశలో వరుసగా మూడు విజయాలు, ఆ తర్వాత సూపర్ 8 లో మూడు విజయాలు, ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థిని కుప్పకూలిచిన ఉత్సాహంతో సెమీస్ లో ఇంగ్లాండ్ పై కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత 2024 జూన్ 29న బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ లో రోహిత్ శర్మ సారధ్యంలోని భారత జట్టు 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.
Also Read: Rishabh Pant: గాయం అంటూ రిషబ్ పంత్ నాటకాలు… టీ20 వరల్డ్ కప్ విజయం వెనుక రహస్యం
దీంతో టీం ఇండియాకు ఇది రెండవ టి-20 ప్రపంచ కప్ టైటిల్. గతంలో 2007లో మహేంద్రసింగ్ ధోని సారధ్యంలో విశ్వవిజేతగా నిలిచింది భారత్. ఇక గతేడాది సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చివరి 4 ఓవర్లలో దక్షిణాఫ్రికా విజయానికి 26 పరుగులు అవసరం కాగా.. భారత బౌలర్లు అద్భుతం చేశారు. 17వ ఓవర్ తొలి బంతికి హార్దిక్ పాండ్యా.. క్లాసెన్ ని అవుట్ చేసి భారత జట్టు శిబిరంలో నమ్మకాన్ని నింపాడు.
ఆ తర్వాత 18వ ఓవర్ వేసిన బుమ్రా.. మార్కో జాన్సన్ ను అవుట్ చేయడమే కాకుండా, ఆ ఓవర్ లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక 19వ ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్.. అద్భుతంగా బంతులు వేసి తీవ్ర ఒత్తిడిలోనూ శభాష్ అనిపించుకున్నాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్ లో సఫారీ జట్టు విజయానికి 16 పరుగులు అవసరం అయ్యాయి.
ఇక చివరి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా.. తొలి బంతికే మిల్లర్ ని అవుట్ చేసి సౌత్ ఆఫ్రికాను దెబ్బతీశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా నిర్ణిత 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసి.. విజయానికి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. అంతకుముందు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన పోరులో భరత్ విజయం సాధించి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. దీంతో 17 ఏళ్ల నిరీక్షణ అనంతరం పొట్టి కప్ ని భారత్ ముద్దాడింది.
Also Read: Kevin Pietersen: భార్యకు తెలియకుండా కెవిన్ పీటర్సన్ అరాచకం… ఆ హీరోయిన్ తో సీక్రెట్ రిలేషన్ !
భారత్ ఈ కప్ గెలిచి సంవత్సరం గడిచిన సందర్భంగా మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆటగాళ్లు సంబరాలు జరుపుకున్నారు. ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హమ్ లో టీమిండియా ఆటగాళ్లు ఈ ప్రత్యేక సందర్భాన్ని వేడుకగా నిర్వహించుకొని.. ఆనాటి మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోని తాజాగా బీసీసీఐ తన అధికారిక ఎక్స్ {ట్విటర్} ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆటగాళ్లందరూ ఒకచోట చేరి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ విజయం తమ కెరీర్ లో ఓ మర్చిపోలేని జ్ఞాపకం అని, ఇది ఎప్పటికీ నిలిచిపోతుందని వారు అభిప్రాయపడ్డారు.
TEAM INDIA CELEBRATING THE T20 WORLD CUP WIN'S ANNIVERSARY. 🇮🇳 pic.twitter.com/PVtnjLO92T
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 30, 2025