Rinku Singh Father: టీమిండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ ( Rinku Singh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ ( Rinku Singh )… మరో వార్తతో వైరల్ అయ్యాడు. తాజాగా తన తండ్రి ఖాన్చంద్ర సింగ్ కు ఓ ఖరీదైన బైక్ గిఫ్ట్ ఇచ్చాడు రింకు సింగ్. తన తండ్రికి రూ.3.19 లక్షల విలువైన బైక్ గిఫ్ట్ ఇచ్చాడు రింకూ. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్యాస్ సిలిండర్లు మోస్తూ… తన కుటుంబాన్ని పోషించేవాడు రింకూ సింగ్ ( Rinku Singh ) తండ్రి ఖాన్చంద్ర సింగ్. అయితే అలాంటి తన తండ్రి ఖాన్చంద్ర సింగ్ కోసం.. మూడు లక్షలు పెట్టి బైక్.. కొన్ని గిఫ్ట్ ఇచ్చాడు.
Also Read: Snehasish Ganguly: టీమిండియా ప్లేయర్లకు మరో షాక్.. ఇకపై ఆ బస్సులే ఎక్కాలి !
ఒక వైపు భారత క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియా నిశ్చితార్థం గురించి వార్తల వస్తున్న తరుణంలోనే… తన తండ్రి ఖాన్‌చంద్ర సింగ్‌కు ( Khanchandra Singh ) సరికొత్త బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాకు చెందిన రింకూ సింగ్ ( Rinku Singh )… తన తండ్రికి కవాసీ నింజా 300 బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. లేత ఆకుపచ్చ రంగులో డిజైన్ లో ఉన్న వాసీ నింజా 300 బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే వీధుల్లో కొత్త వాహనంతో రైడ్ చేస్తూ కనిపించారు రింకూ సింగ్ ( Rinku Singh ) తండ్రి ఖాన్చంద్ర సింగ్.
ఆ కొత్త వాహనానికి పూల దండ, కుంకుమ, నిమ్మకాయలు కూడా కట్టారు. భారతదేశంలో కొత్త వాహనం కొనుగులు చేస్తే సాంప్రదాయ ఆచారంగా పూల దండ, కుంకుమ, నిమ్మకాయలు కడతారు. రింకూ సింగ్ ( Rinku Singh ) కొనుగోలు చేసిన బైక్ కు సాంప్రదాయ ఆచారంగా పూల దండ, కుంకుమ, నిమ్మకాయలు కట్టారు. ఇక ఆ బైక్ ను రైడ్ చేస్తూ కనిపించారు రింకూ సింగ్ ( Rinku Singh ) తండ్రి ఖాన్చంద్ర సింగ్ ( Khanchandra Singh ). ఇక దీనికి సంభందించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
Also Read: WV Raman: నరకంలో ఆ మాజీ క్రికెటర్..చనిపోయి, మళ్లీ బతికానంటూ పోస్ట్ !
ఇది ఇలా ఉండగా … అలీగఢ్‌లో ఇళ్లకు ఎల్‌పిజి సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు రింకూ సింగ్ తండ్రి ఖాన్చంద్ర సింగ్ ( Khanchandra Singh ) . అతని అన్నయ్య ఆటో రిక్షా నడిపేవాడు. ఇక 27 ఏళ్ల క్రికెటర్ రింకూ సింగ్‌కి లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్‌తో ( Priya Saroj) నిశ్చితార్థం జరిగినట్లు పలు వార్తలు వచ్చాయి. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించిన ప్రకారం, ప్రియా తండ్రి, తూఫాన్ సరోజ్ మాత్రం భిన్నంగా స్పందించారు. పెళ్లి నిశ్చయానికి అంగీకరించినప్పటికీ, నిశ్చితార్థ వేడుక ఇంకా జరుగలేదని తెలిపారు తూఫాన్ సరోజ్.
Rinku Singh gifted a Kawasaki Ninja Superbike to his father 🥹♥️
– Rinku is winning the heart of all…!!! pic.twitter.com/Ew9Ekgbel6
— Johns. (@CricCrazyJohns) January 20, 2025