ICC Rankings: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 – 2025 ( Border Gavaskar Trophy 2024 – 2025 ) ఓడిపోయిన టీమ్ ఇండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయినందుకు గాను… ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ర్యాంకింగ్స్ లో… మూడవ స్థానానికి పడిపోయింది టీమిండియా. దాదాపు పది సంవత్సరాల తర్వాత… మూడవ స్థానానికి టీమిండియా పడిపోయింది. ఈ 10 సంవత్సరాలుగా 1 లేదా 2వ స్థానంలో టీమిండియా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Also Read: Yuzvendra Chahal: విడాకులపై చాహల్ సంచలన పోస్ట్..రీసౌండ్ రావడం పక్కా ?
కానీ మొన్నటి వరకు జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్ లో ( Border Gavaskar Trophy 2024 – 2025 ) భాగంగా జరిగిన ఐదు టెస్టుల్లో కేవలం ఒక్క టెస్ట్ మాత్రమే టీమిండియా విజయం సాధించింది. ఒక టెస్ట్ డ్రా అయింది. మిగిలిన టెస్టులన్నీ ఆస్ట్రేలియా విజయం సాధించడం జరిగింది. దీంతో… ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా కు ( Team India ) ఊహించని శాఖ తగిలింది. తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో ( ICC Rankings ) మూడవ స్థానానికి దిగజారింది టీం ఇండియా.
2016 సంవత్సరం తర్వాత… ఇలా మూడవ స్థానానికి టీమిండియా దిగజారింది. అటు పాకిస్తాన్ ను… సొంత గడ్డపై చిత్తు చేసిన దక్షిణాఫ్రికా… ఐసీసీ ర్యాంకింగ్స్ లో మెరుగుపడింది. పాకిస్తాన్ ( Pakisthan ) వర్సెస్ సౌత్ ఆఫ్రికా మొన్నటి వరకు రెండు టెస్టు మ్యాచ్లు జరిగాయి. ఇందులో రెండు మ్యాచ్లకు గాను దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో మెరుగుపడ్డ దక్షిణాఫ్రికా… రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
Also Read: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఆస్ట్రేలియా ఔట్.. సౌతాఫ్రికాను ఢీ కొట్టేది ఎవరంటే?
ఇక అటు… బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో ( Border Gavaskar Trophy 2024 – 2025 ) అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా… మొదటి స్థానంలో నిలిచింది. దీంతో మూడవ స్థానాన్ని టీమిండియా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 39 మ్యాచ్లు ఆడిన టీమిండియా.. 4248 పాయింట్లు సాధించింది. దీంతో 19 ర్యాంక్ సాధించడం జరిగింది. మొదటి స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా 36 టెస్టులు ఆడడం జరిగింది. ఈ టెస్ట్ లలో 4531 సాధించిన ఆస్ట్రేలియా 126వ ర్యాంకు సంపాదించింది. ఇలా నెంబర్ వన్ స్థానాన్ని ఆస్ట్రేలియా దక్కించుకోగలిగింది.
ఇది ఇలా ఉండగా…. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024- 2025 టోర్నమెంట్ లో దారుణంగా ఓడిపోయిన టీమిండియా… టెస్ట్ ర్యాంకింగ్స్ లోనే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా కోల్పోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి 5వ టెస్ట్ మ్యాచ్లో గెలిచి ఉంటే…. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అర్హత పొందేది. కానీ ఐదవ టెస్టులు అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచింది టీమిండియా. దీంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ తరుణంలోనే ఆస్ట్రేలియా అలాగే సౌత్ ఆఫ్రికా రెండు జట్లు కూడా….. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అర్హత సంపాదించాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.