Team India WTC Schedule: ప్రస్తుతం ఆస్ట్రేలియా ( Australia) టూర్ లో ఉన్న టీం ఇండియా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే టీమిండియా…ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ కు ( ICC World Test Championship ) సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ స్థానం కోసం పోరాడుతున్న టీమ్ ఇండియాకు.. 2025- 2027 కు సంబంధించిన ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ( ICC World Test Championship ) కు సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.
ఇక ఈ షెడ్యూల్ ప్రకారం… వచ్చే డబ్ల్యూటీసి కోసం ఆరు టెస్ట్ సిరీస్ లు ఆడబోతోంది టీం ఇండియా. ఈ ఆరు టెస్టులు కూడా స్వదేశం అలాగే విదేశాల్లో ఉన్నాయి. మన స్వదేశంలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లతో పాటు సౌత్ ఆఫ్రికాలతో ఫైట్ ఉండనుంది. ఇక విదేశాలలో… న్యూజిలాండ్ అదే సమయంలో శ్రీలంకతో సిరీస్ లు ఉన్నాయి. ఇలా స్వదేశం ఇటు విదేశీ టూర్లను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే విదేశాల్లో.. టీమిండియా సులభంగా గెలిచే జట్లే ఉన్నాయి. ఇటు స్వదేశంలో బలమైన జట్లు ఉండడం గమనార్హం. అంతేకాదు వచ్చే సంవత్సరం జూన్ మాసంలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కూడా ఆడనుంది టీమిండియా.
అంటే ఈ లెక్కన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ తర్వాత దాదాపు నాలుగు నెలల వరకు… టీమిండియా కు టెస్టు సిరీస్ లేదన్నమాట. మళ్లీ జూన్ లోనే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఉండనుంది. అటు వచ్చే సంవత్సరం అక్టోబర్ లో సౌత్ ఆఫ్రికా తో టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుంది. ఇలా… టీమిండియా కు సంబంధించిన ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ( ICC World Test Championship ) షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై త్వరలోనే ఐసీసీ, ఇటు భారత క్రికెట్ నియంత్రణ మండలి రెండూ కూడా అధికారిక ప్రకటన చేయబోతున్నాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ తర్వాత..ఈ షెడ్యూల్ పైన అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా… టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇప్పటికే టెస్ట్ మ్యాచ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రెండవ టెస్టులో మాత్రం ఆస్ట్రేలియా విజృంభించి ఆడింది. దీంతో సిరీస్ సమంకావడం జరిగింది.అయితే మూడో టెస్టులో కచ్చితంగా టీమిండియా గెలుస్తుందని అందరూ అనుకున్నారు.
కానీ వర్షం కారణంగా ఈ మూడవ టెస్ట్ మ్యాచ్ డ్రాగ ముగిసింది. ఒకానొక సమయంలో… మూడో టెస్టులో టీమిండియా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ వర్షం కారణంగా టీమిండియా బతికి బయటపడింది. దీంతో మ్యాచ్ డ్రాగ ముగిసింది. దీని ఫలితంగా డబ్ల్యూటీసి ఎఫెక్ట్ టీమిండియా పైన పెద్దగా పడలేదు. మూడవ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయి ఉంటే టీమిండియా కు….మరిన్ని కష్టాలు వచ్చేవి.ఇక ఆస్ట్రేలియాతో మరో రెండు టెస్టులు ఉన్న సంగతి తెలిసిందే. జనవరి మాసంలో ఈ టెస్ట్ సిరీస్ పూర్తి అవుతుంది.
View on Threads