2025 Physical Disability Champions Trophy: టీమిండియా క్రికెట్ జట్టు అదిరిపోయే విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లండ్‌ను ఓడించి 2025 ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీని ( 2025 Physical Disability Champions Trophy ) భారత్ గెలుచుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి మరి… ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలవడం జరిగింది. 2025 ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ ( 2025 Physical Disability Champions Trophy ) ఫైనల్ శ్రీలంకలోని కటునాయకేలోని ఎఫ్‌టిజెడ్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగింది. అయితే, 2025 ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో 79 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి…ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా.
Also Read: ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను నిలబెట్టిన వీరులు ?
ఇక ఈ దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( 2025 Physical Disability Champions Trophy ) ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయిన టీమ్ ఇండియా చివరకు ఫైనల్ లో గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఛాంపియన్గా నిలవడం జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు ( Team India) నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది.
టీమిండియా తరఫున యోగేంద్ర సింగ్ బదౌరియా ( Yogendra Singh Bhadoriya )… అద్భుతంగా ఆడడంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. 40 బంతుల్లో ఏకంగా 73 పరుగులు చేసి.. టీమిండియాను ( Team India) ఆదుకున్నాడు యోగేంద్ర సింగ్ బదౌరియా ( Yogendra Singh Bhadoriya ). ఇక 198 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… ఇంగ్లాండ్ జట్టు తడబడిపోయింది. నీతో చివరకు ఓడిపోయింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండు ( England )… చివరకు 118 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
Also Read: U19 Women’s T20 World Cup 2025: వైష్ణవికి హ్యాట్రిక్.. మలేషియాపై 2 ఓవర్లలోనే టీమిండియా విక్టరీ
ఇంకేముంది ఈ దెబ్బకు… 79 పరుగుల తేడాతో విక్టరీ సాధించిన టీమిండియా చాంపియన్గా నిలిచింది. ఇక దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీలో ( 2025 Physical Disability Champions Trophy ) విజేత అయిన టీమిండియా పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో మొత్తం నాలుగు జట్లు పాల్గొనడం జరిగింది. ఈ నాలుగు జట్టలో టీమిండియా ఇంగ్లాండ్ అలాగే శ్రీలంక, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. లీగ్ దశలో టీమిండియా ఏకంగా ఆరు మ్యాచ్లు ఆడితే ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించడం జరిగింది. ఒకే ఒక్క మ్యాచ్లో టీమ్ ఇండియా ఓడిపోయింది. ఈ టోర్నమెంట్లో మొట్టమొదట మ్యాచ్ పాకిస్తాన్ జట్టును ఓడించి.. విజయకేతనం ప్రారంభించింది టీమిండియా. చివరకు ఇంగ్లాండును ఫైనల్ మ్యాచ్లో ఓడించి… ఛాంపియన్గా నిలిచింది.
🏆 A historic triumph! Team India defeated England by a massive 79 runs to claim the PD Champions Trophy 2025.
An extraordinary display of teamwork, determination, and skill!#AbJunoonJitega #TeamIndia #PDChampionTrophy2025 #DCCI #CricketForAll #DumHaiTeamMai #BreakingBarriers pic.twitter.com/i8XnqubtQh
— Differently Abled Cricket Council of India (@dcciofficial) January 21, 2025