U19 Women’s T20 World Cup 2025: ఐసీసీ అండర్ 19 ఉమెన్స్ T20 ప్రపంచ కప్ లో టీమిండియా మరో విక్టరీ కొట్టింది. ఇప్పటికే మొదటి మ్యాచ్ లో గెలిచిన మహిళల అండర్ 19 టీమిండియా జట్టు… ఇవాళ రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది. తమ ప్రత్యర్థి మలేషియా తో ఇవాళ రెండవ మ్యాచ్ ఆడింది మహిళల టీమ్ ఇండియా జట్టు. అయితే ఈ మ్యాచ్లో మలేషియా పైన 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది భారత్. 32 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2.5 ఓవర్లలోనే… చేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ వైష్ణవి హైట్రిక్ కూడా సాధించింది. ఈ మ్యాచ్ లో హైట్రిక్ వికెట్లు తీయడమే కాకుండా ఐదు వికెట్లు పడగొట్టింది.
Also Read: IND vs Eng 1st Odi: అదానీ కోసం..టీమిండియా, ఇంగ్లాండ్ మ్యాచ్ రద్దు ?
ఐసీసీ అండర్ 19 ఉమెన్స్ T20 ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో మొత్తం నాలుగు ఓవర్లు వేసింది వైష్ణవి శర్మ. ఆమె వేసిన నాలుగు ఓవర్లలో… 20 బంతుల్లో ఒక్క పరుగు కూడా రాలేదు. ఆమె నాలుగు ఓవర్లలో కేవలం ఐదు పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు తీయడం జరిగింది. ఇందులో హైట్రిక్ కూడా ఉంది. ఇలా టి20 మ్యాచ్ లో హైట్రిక్ తీయడం వైష్ణవి శర్మకు మొదటిసారి కావడం విశేషం. వైష్ణవి శర్మ ఐదు వికెట్లు పడగొట్టడంతో మలేషియా కోలుకో లేకుండా… పోయింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన మలేషియా మహిళల అండర్ 19 జట్టు… 31 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
14.3 ఓవర్లు వాడిన మలేషియా మహిళల అండర్ 19 జట్టు… 31 పరుగులకు కుప్పకూలింది. ఇక మలేషియా అండర్ 19 మహిళల జట్టులో… ఏకంగా నలుగురు డకౌట్ అయ్యారు. ఒక్కరు కూడా సింగిల్ డిజిట్ దాటలేదు. ఓపెనర్ నూర్ ఆలియా ఐదు పరుగులు చేయగా హుస్నా ఐదు పరుగులు చేసింది. ఈ ఇద్దరు బ్యాటర్ లే ఐదు పరుగులు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లు అంతా ఒకటి, లేదా రెండు పరుగులు మాత్రమే చేశారు. ఇక మలేషియా మహిళల అండర్ 19 జట్టు సారధి నూర్ ధనియా ఒకే ఒక పరుగు చేసి వైష్ణవి శర్మ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయింది.
Also Read: Watch: ముసలోడే కానీ మహా ముదురు..ఈయన ముందు రోహిత్, కోహ్లీ పనికి రారు !
ఇక 32 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… టీమిండియా అండర్-19 మహిళల జట్టు ఆచితూచి ఆడడం జరిగింది. ఒక్క వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసి పదవికిట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా మహిళల జట్టు. గొంగడి త్రిష 27 పరుగులు చేయగా కమలిని నాలుగు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఈ తరుణంలోనే ఐసీసీ అండర్ 19 ఉమెన్స్ T20 ప్రపంచ కప్ లో టీమిండియా మరో విక్టరీ కొట్టింది. ఈ విజయంతో టీమిండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు గెలిచింది.
Vaishnavi Sharma
Overs:- 4
Dots:- 20
Runs:- 5
Wickets:- 5
Economy:- 1.25A dream debut for Vaishnavi Sharma as she secured a splendid FIFER and an excellent hattrick on her debut 👏🏻
📷:- Disney+ Hotstar #INDWvMASW #T20 #U19T20WorldCup #WomensCricket #Insidesport… pic.twitter.com/hI0pvbGRaB
— InsideSport (@InsideSportIND) January 21, 2025