Allu Arjun Case: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కేసుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. ఈ కేసు గురించి అసెంబ్లీలోనే ఆయన ఘాటుగా స్పందించిన విషయం తెల్సిందే. ” అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ లో నా జోక్యం ఏమీ ఉండదు, చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని” చెప్పారు.
అంతేకాకుండా ఘటన జరిగిన వెంటనే బాధితులను ఎందుకు కలవలేదు అని సీఎం ఫైర్ అయ్యారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా బెన్ ఫిట్ షోలను రద్దు చేశారు. ఇక దీనిపై ఇండస్ట్రీ అసహనం వ్యక్తం చేసింది. దీని తరువాత సీఎం తో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక బెనిఫిట్ షో విషయం మినహా.. మిగతా అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించారు.
ఇక ఈ భేటీ తరువాత చాలా జరిగాయి. అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆ దాడిని సీఎం ఖండించారు. ఇక ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ కేసు సద్దుమణుగుతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి.. మరోసారి అల్లు అర్జున్ కేసుపై స్పందించారు. తాజాగా సీఎం దావోస్ పర్యటనలో ఉన్న విషయం తెల్సిందే. అందులో భాగంగా ఆయనకు అల్లు అర్జున్ గురించిన ప్రశ్న ఎదురయ్యింది.
తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదుకదా అన్న ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ.. ” రెండు రోజులముందు అనుమతి కోసం వస్తే.. పోలీసులు నిరాకరించారు. అయినా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈక్రమంలో తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయారు. ఒక మనిషి చనిపోవడమన్నది ఆయన చేతుల్లో లేకపోవచ్చు. కానీ, 10-12 రోజులు అయినా బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక ఈ కేసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 2 బెన్ ఫిట్ షోలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. అనుమతి లేకుండా బన్నీ థియేటర్ కు రావడంతోనే మహిళా మృతి చెందింది అని పోలీసులు అల్లు అర్జున్ పై కేసు వేశారు. బన్నీని విచారణకు కూడా తీసుకెళ్లారు. కోర్టులో బెయిల్ రావడంతో బయటపడ్డాడు.
ఇక బయటకు రాగానే ప్రెస్ మీట్ పెట్టి.. పోలీసులు తనకు రేవతి మృతి గురించి చెప్పలేదని అబద్దాలు చెప్పాడు. దీంతో ఫైర్ అయిన పోలీసులు.. మరోసారి కేసు నమోదు చేసి విచారించారు. రెండు సార్లు సొంత పూచికత్తుతో బన్నీకి బెయిల్ వచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ మీదనే బయట ఉన్నాడు.