Big Stories

Team India Performance: ఇలా ఆడితే ఎలా..? కప్పు గెలిచే అవకాశాలు దాదాపు కష్టమే..!

Team India Performance in ICC Men T20 World Cup 2024: పాకిస్తాన్ పై గెలిచిన ఆనందం.. ఆ క్షణమే ఉన్నా, ఇప్పుడెవరిలో కనిపించడం లేదు. ఎందుకంటే ఆ స్థానంలో ఇప్పుడందరిలో ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే మన టీమ్ ఇండియా మొనగాళ్లు ఇలాగే ఆడితే, మరి కప్పు కొడతామా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. ఏదో అద్రష్టవశాత్తూ బుమ్రా ఉండబట్టి, హార్దిక్ పాండ్యాకు అంబ పలికింది కాబట్టి, తక్కువ స్కోరు అయినా బతికి బట్ట కట్టగలిగాం.. మరి అన్నివేళలా ఇది వర్కవుట్ కాదు కదా అంటున్నారు.

- Advertisement -

మన టాప్ ఆర్డర్ ఎందుకిలా విఫలం అవుతోందనే విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి. టీమ్ ఇండియాకి విరాట్ కొహ్లీ వెన్నుముకలాంటి వాడు. తను ఉండటం, జట్టులో అందరికి ఒక మానసిక స్థయిర్యాన్ని ఇస్తుంది. అలాంటి కొహ్లీ కీలకమైన పాక్ తో జరిగిన మ్యాచ్ లో 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, అలాంటి పిచ్ లపై తనలాంటి సీనియర్లే ఆడలేకపోతే, కొత్తవాళ్లు ఎలా ఆడతారని అంటున్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. సూపర్ 8 కి చేరిన తర్వాతయినా సరే, బాగా ఆడి కప్ తీసుకురావాలని కోరుతున్నారు. ఇక టీమ్ ఇండియావైపు చూస్తే….

- Advertisement -

కెప్టెన్ రోహిత్ శర్మ తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో ఆఫ్ సెంచరీ చేశాడు. కీలకమైన పాకిస్తాన్ పై 13 పరుగులు మాత్రమే చేశాడు.

ఇక సూర్యకుమార్ యాదవ్ సైతం నిరాశపరుస్తున్నాడు. ఐర్లాండ్ తో 2 , పాక్ పై 7 పరుగులు చేశాడు. రేపు యూఎస్ఏ, కెనడాపై ధనాధన్ ఆడేసి సూపర్ 8లో చేతులెత్తేయవద్దని కోరుతున్నారు.

Also Read: టీమ్ ఇండియా.. ఓ చెత్త రికార్డ్

చిచ్చర పిడుగు రింకూసింగ్ ని కాదని, ఐపీఎల్ లో గొప్పగా ఆడిన శివమ్ దుబెను తీసుకొచ్చారు.  ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో క్రీజులో ఉన్నా ఆడే అవకాశం రాలేదు. కాకపోతే చివర్లో 2 వికెట్లు మాత్రం తీశాడు. బ్యాటింగులో చూస్తే పాక్ పై 3 పరుగులు మాత్రమే చేశాడు. విలువైన రిజ్వాన్ క్యాచ్ డ్రాప్ చేశాడు. నిజంగా బుమ్రా, ఆ వికెట్ తీయకపోతే..చరిత్రలో ఒక చేదు జ్నాపకంగా మిగిలిపోయేవాడు.

రవీంద్ర జడేజాలో ఆ స్పార్క్ కనిపించడం లేదు. మరి వయసు అయిపోయిందా?, ఇంట్రస్ట్ తగ్గిందా? తెలీడం లేదు. తన స్థాయికి తగ్గ ప్రదర్శన రావడం లేదు. ఐర్లాండ్, పాకిస్తాన్ రెండు మ్యాచ్ ల్లో ఒక్క వికెట్ తీయలేదు. పాకిస్తాన్ పై గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు.

ఎటొచ్చి బాగా ఆడేవారు ఎవరు కనిపిస్తున్నారంటే, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్, సిరాజ్ వీళ్లు ఐదుగురే ఉన్నారు. మరి వీళ్లందరూ మిగిలిన ఆరుగురి భారాన్ని మోస్తూ.. మరి కప్పు తీసుకువస్తారా? అంటే అవునని మనస్ఫూర్తిగా ఎవరూ చెప్పలేకపోతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News