
Rekha Boj : తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు హీరోయిన్లు కావాలనుకునేవాళ్లు కొత్త పబ్లిసిటీకి తెరలేపుతున్నారు. అంటే తమకి రావల్సిన పేరు రావడం లేదనో లేక తమ గురించి అందరూ చర్చించాలని అనుకుంటున్నారో తెలీదు. తాజాగా తెలుగు నటి రేఖా భోజ్ సంచలన కామెంట్ చేసి నెట్టింట హల్ చల్ చేస్తున్నారు.
ఇండియాగానీ వరల్డ్ కప్ సాధిస్తే, తను విశాఖ బీచ్ లో బట్టలు విప్పి పరిగెడతానని ప్రకంటించారు. దీంతో ఇదేం ఘోరంరా బాబూ అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. పబ్లిసిటీ కావాలనుకుంటే ఇంతగా దిగజారిపోవాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇంతకుముందు బాలీవుడ్ లో పూనం పాండే అని ఒక శృంగార తార ఉండేది. తను కూడా ఇలాగే ఒకప్పుడు ఇండియా ప్రపంచకప్ గెలిస్తే బట్టలు లేకుండా గ్రౌండ్ లో పరిగెడతానని ప్రకటించి సంచలనం సృష్టించింది. అది పెద్ద దుమారాన్నే రేపింది. ఆ తర్వాత కూడా అక్కడితో ఆగలేదు. ఎప్పుడు ఇండియా నాకౌట్ దశకు వెళ్లినా నెటిజన్లు పూనం పాండే తో చాటింగ్ చేస్తుంటారు. దానికి తను కూడా ఘాటుగానే బదులిస్తుంటుంది.
క్రికెట్ మొదలై మనవాళ్లు నాకౌట్ కి వెళితే చాలు నేనే గుర్తొస్తానా? చెప్పిన మాట చేసేయాల్సిందేనా? అని రివర్స్ లో సమాధానం ఇస్తుంటుంది. ఇది జరిగి అప్పుడే 12 ఏళ్లు దాటిపోతోంది. అందుకే తనని అందరూ మరిచిపోయారని అనుకుందో ఏమో.. తెలుగు నటి రేఖా భోజ్.. ఆ ఆఫర్ తనిస్తానని అంటోంది.
ఇంతకీ పూనమ్ లా గ్రౌండ్ లో కాదంట. వైజాగ్ బీచ్ లో పరిగెడతానని చెప్పింది. ఇంతకీ రేఖా భోజ్ ఏ సినిమాల్లో నటించిందంటే దామినీ విల్లా, మాంగళ్య, కాత్యాయని ఇలా చేసింది. కానీ పెద్దగా పేరు రాలేదు. అందుకే ఇలాగైనా వస్తుందని బహుశా ప్రయత్నిస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు ఇదే వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ మోడల్ శెహర్ షిన్వారీ చేసిన డేటింగ్ ప్రకటన కూడా సంచనలం సృష్టించింది. ఇండియాని గానీ బంగ్లాదేశ్ టీమ్ ఓడిస్తే వారితో డేటింగ్ కి వెళతానని ప్రకటించింది. తర్వాత మళ్లీ సవరించుకుంది. ఎవరు బాగా ఆడి ఇండియాని ఓడిస్తారో వాళ్లతోనే వెళతానని చెప్పింది. ఆమె అనుకున్నట్టేమీ జరగలేదు. బంగ్లాదేశ్ వాళ్లే ఓటమి పాలయ్యారు. కానీ వీళ్ల స్టేట్మెంట్లు మాత్రం ఆగడం లేదని నెటిజన్లు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు.