PKL 2025 : ప్రొ కబడ్డీ లీగ్ 2025, సీజన్ 12లో తెలుగు టైటాన్స్ టీమ్ వరుసగా మూడో విజయంతో సత్తా చాటింది. హోం గ్రౌండ్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన తెలుగు టైటాన్స్ తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడినప్పటికీ ఇప్పుడు హ్యాట్రిక్ విజయాలతో వైజాగ్ లో ముగించింది. బుధవారం రాత్రి జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 45-37 స్కోర్ తో యూ ముంబాను చిత్తు చేసింది. టైటాన్స్ తరుపున ముఖ్యంగా భరత్ హుడా 13 పాయింట్లతో చెలరేగాడు. అలాగే చేతన్ సాహు 6, కెప్టెన్ విజయ్ మాలిక్ 5 పాయింట్లతో అతనికి సహకరించారు. ప్రధానంగా చివరి పది నిమిసాల్లో కాస్త పోరాడి తెలుగు టైటాన్స్ ను ఆలౌట్ చేసినప్పటికీ పాయింట్లను మాత్రం తగ్గించలేకపోయింది.
Also Read : Unmukt Chand : ఇండియాను వదిలేశాడు… ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు.. భార్యతో ఉన్ముక్త చంద్ రొమాంటిక్ ఫోటోలు
దీంతో యు ముంబా ఆటగాళ్లలో సందీప్, అమిర్ మహమ్మద్ చెరో 7 పాయింట్లను సాధించారు. అయితే తెలుగు టైటాన్స్ కి వైజాగ్ వేదిక హ్యాట్రిక్ తో ముగించింది. యు ముంబా మాత్రం ఇవాళ పాట్నా పైరేట్స్ తో తలపడనుంది. అలాగే ఇవాళ దబంగ్ ఢిల్లీతో గుజరాత్ జెయింట్స్ తలపడతాయి. దీంతో తొలి 28 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చిన విశాఖపట్టణం లో ఇవాళ్టితో పీకేఎల్ పోటీలు ముగిసిపోతాయి. రేపటి నుంచి జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా టోర్నీ కొనసాగనుంది. ఈ టోర్నీ చాలా రసవత్తరంగా కొనసాగనుంది.మరోవైపు మొన్న సొంత గడ్డ పై ఆతిథ్య తెలుగు టైటాన్స్ జోరు పెంచిందనే చెప్పాలి. వైజాగ్ లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్ 44-34 స్కోర్ తో పటిష్టమైన బెంగాళ్ వారియర్స్ ను ఓడించింది.
ముఖ్యంగా కీలక మ్యాచ్ లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. తెలుగు టైటాన్స్ ఆటగాళ్లలో భరత్ 12, విజయ్ మాలిక్ 11 పాయింట్లను రాబట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ 11 నిమిషంలో వారియర్స్ ఆలౌట్ చేసి ఒత్తిడి చేశారు. విజయ్ రైడ్ లో మూడు పాయింట్లు రాబట్టి టైటాన్స్ శిబిరంలో ఉత్సాహం పెంచాడు. ప్రథమార్థాన్ని 23-14 ఆధిక్యంతో ముగించిన టైటాన్స్ ఆటగాళ్లు ద్వితీయార్థంలో అదే జోరు కొనసాగించి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ దశలో వారియర్స్ పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముఖ్యంగా యు ముంబాతో జరిగిన పోరులో 6వ నిమిషంలో యు ముంబాను ఆలౌట్ చేసింది తెలుగు టైటాన్స్. ఇక అలాగే 14వ నిమిషంలో కూడా మరోసారి ఆ జట్టును ఖాళీ చేసింది. దీంతో విరామం సమయానికి తెలుగు టైటాన్స్ 27-11 తో తిరుగులేని శక్తిగా నిలిచింది. విరామం తరువాత యు ముంబా పుంజుకున్నప్పటికీ తెలుగు టైటాన్స్ విజయాన్ని ఆపలేకపోయింది. మరో మ్యాచ్ లో పుణెరి ఫల్టాన్ 43-32తో యూపీ యోధాస్ ను ఓడించింది. ఆదిత్య షిండే 12 పాయింట్లతో పుణెరి విజయంలో కీలక పాత్ర పోషించాడు.