BigTV English

Thaman – Akhil: తమన్ ను గట్టిగా తన్నిన అఖిల్.. వీడియో వైరల్ !

Thaman – Akhil: తమన్ ను గట్టిగా తన్నిన అఖిల్.. వీడియో వైరల్ !

Thaman – Akhil: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ {సిసిఎల్} 11వ సీజన్ ఈనెల 8వ తేదీన ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లోని మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సినీ తారలు క్రికెటర్లను మించి పోరాడుతూ విజయం కోసం చెమటలు కక్కుతున్నారు. ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ సినీ, క్రీడా అభిమానులను అలరిస్తోంది. ఈ లీగ్ లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు జరిగాయి. అయితే ఈ 11వ సీజన్ లో తెలుగు వారియర్స్ జట్టు తడబాటుతో తన జర్నీని ప్రారంభించింది.


Also Read: Hardik Pandya: పాక్ ప్లేయర్లకు చేతబడి..పాండ్యా ఫోటోలు వైరల్ !

తొలి మ్యాచ్ లో కర్ణాటక బుల్డోజర్స్ జట్టు చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆ తరువాత రెండవ మ్యాచ్ లో పోరాడి భోజ్ పురి దబాంగ్ జట్టుపై విజయం సాధించింది. అక్కినేని అఖిల్ తెలుగు వారియర్స్ జట్టుకు ప్రతినిత్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14 రోజున తెలుగు వారియర్స్ – భోజ్పురి దబాంగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో.. భోజ్పురి దబాంగ్ పై తెలుగు వారియర్స్ 7 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.


చివరి వరకు ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ పోరాడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ మొదటి ఇన్నింగ్స్ లో నిర్ణీత 10 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 80 పరుగులు చేసింది. ఆ తర్వాత బోజ్పురి నాలుగు వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది. కానీ రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం తెలుగు వారియర్స్ పికప్ అందుకొని నిర్ణీత 10 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది.

ఆ తర్వాత భోజ్పురి రెండవ ఇన్నింగ్స్ లో 79 పరుగులకు కుప్పకూలింది. దీంతో తెలుగు వారియర్స్ గ్రాండ్ విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భోజ్పురి దబాంగ్స్ పై తెలుగు వారియర్స్ విజయం సాధించిన అనంతరం.. తెలుగు వారియర్స్ జట్టు సభ్యులు సంబరాలు చేసుకునేందుకు గ్రౌండ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ సందర్భంలో తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్ అక్కినేని అఖిల్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ అని వెనక నుండి తంతునట్లుగా ఉంది.

 

దీంతో అఖిల్ థమన్ కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజెన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఈ మ్యాచ్ లో మరో వీడియో కూడా వైరల్ గా మారింది. తెలుగు వారియర్స్ జట్టు 50 పరుగులు పూర్తి చేసిన నేపథ్యంలో అదిరిపోయే డ్యాన్స్ తో రెచ్చిపోయాడు థమన్. తన బ్యాట్ పైకి లిఫ్ట్ చేసి చిన్న పిల్లాడిలా డ్యాన్స్ చేశాడు. దీంతో థమన్ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Big Stories

×