Dhoni In IND vs Pak: టీవీలో పాక్ మ్యాచ్ చూశాడు టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni ). ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సీన్ చూసిన వాళ్లందరూ షాక్ అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ అలాగే టీమిండియా మధ్య మ్యాచ్ ( India vs Pakistan game ) జరుగుతున్న సంగతి తెలిసిందే. టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో… జనాలంతా ఇంట్లోనే టీవీ చూస్తున్నారు. ఆదివారం కావడంతో టీవీలకు అతుక్కుపోయి మరి…. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తిలకిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ మ్యాచ్ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Hardik Pandya: పాక్ ప్లేయర్లకు చేతబడి.. పాండ్యా ఫోటోలు వైరల్ !
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ను మహేంద్రసింగ్ ధోని… గ్రౌండ్ లో చూడకుండా కేవలం టీవీలో చూడడం… ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రేక్షకులు అందరిలాగానే మహేంద్రసింగ్ ధోని కూడా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ చూసాడు. ఓ యాడ్ షూట్ లో భాగంగా… ఓ ఈవెంట్ కు వెళ్లాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ నేపథ్యంలోనే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ స్క్రీన్ పైన వేశారు అక్కడి నిర్వాహకులు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ పైన ఈ మ్యాచ్ ను చూసాడు మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోనీ తో పాటు… సన్నీ డియోల్ ( Sunny Deol ) కూడా అక్కడే ఉన్నాడు. యాడ్ షూట్ కోసం వచ్చి… మహేంద్రసింగ్ ధోని అలాగే సన్నీ డియోల్ ఇద్దరు కూడా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ చూడడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మహేంద్ర సింగ్ ధోని ఇలా సింపుల్ గా… స్క్రీన్ పైన మ్యాచులు చూడటాన్ని… ఫ్యాన్స్ చాలా వింతగా చూస్తున్నారు.
కోట్ల డబ్బులు ఉన్నా సరే స్క్రీన్ పైన మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ చూడడం ఏంటని షాక్ అవుతున్నారు. మహేంద్ర సింగ్ ధోని ఏది చేసినా చాలా వింతగా ఉంటుందని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఛాంపియన్ ట్రోఫీ టోర్నమెంట్లో మహేంద్రసింగ్ ధోని ని మిస్ అవుతున్నామని కూడా కొంతమంది. కాగా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ లోనే టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2013 సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ లోనే… ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది టీమ్ ఇండియా. ఇది ఇలా ఉండగా..పాకిస్తాన్ అలాగే టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సగంకు పైగా వికెట్లు కోల్పోయింది రిజ్వాన్ టీం. 5 వికెట్లు నష్టపోయి 188 పరుగులు మాత్రమే చేసింది పాక్.
Also Read: IND vs Pak: బ్యాటింగ్ తీసుకున్న పాక్..భారీ స్కెచ్ తో టీమిండియా
#INDvsPAK మ్యాచ్ చూస్తున్న https://t.co/PQzLbHrgXj @msdhoni
ఓ యాడ్ షూట్లో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై మ్యాచ్ చూస్తున్నారు. pic.twitter.com/gpHY4rjIYZ
— greatandhra (@greatandhranews) February 23, 2025