Hardik Pandya: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఉత్కంఠ భరితమైన భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభమైంది. క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడి.. భారత జట్టు మొదట బౌలింగ్ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓ రికార్డుని సాధించాడు.
Also read: Yuvraj Singh: 43 ఏళ్ల వయసులోనూ యువరాజ్ స్టన్నింగ్ క్యాచ్ !
ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోవడంతో.. వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్ గా రికార్డ్ సాధించాడు రోహిత్ శర్మ. 2023 ప్రపంచ కప్ ఫైనల్స్ నుండి భారత్ వరుసగా 12 టాస్ లను కోల్పోయింది. అలా వన్డేలలో ఒక జట్టుకు ఇదే అత్యధికం. ఇక టాస్ ఓడిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. గత మ్యాచ్ మాదిరిగానే పిచ్ స్లోగా ఉందని.. బ్యాటింగ్ లో తమకు అనుభవిజ్ఞులైన యూనిట్ ఉన్నందున పిచ్ స్లోగా ఉన్నప్పటికీ ఏం చేయాలో మాకు తెలుసు అన్నాడు. గత మ్యాచ్ నుంచి ఎంతగానో నేర్చుకున్నామని.. అది మాకు ఉపయోగపడుతుందని చెప్పాడు.
ఇక మ్యాచ్ ప్రారంభమైన అనంతరం పాకిస్తాన్ బ్యాటర్లు నిదానంగా ఆడసాగారు. ఈ క్రమంలో 41 పరుగుల వద్ద.. 23 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్న బాబర్ అజామ్ ని హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పాకిస్తాన్ 41 పరుగుల వద్ద తొలి వికెట్ ని కోల్పోయింది. అయితే హార్దిక్ పాండ్యా ఈ బాల్ వేయడానికి ముందు చేసిన ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ బాల్ వెయ్యడానికి ముందు తన తలని కిందికి పెట్టి.. బాల్ ని రెండు చేతులతో పట్టుకొని కనిపించాడు హార్థిక్ పాండ్యా. దీంతో సోషల్ మీడియాలో నెటిజెన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా చేతబడి చేశాడని.. ఆ కారణంగానే బాబర్ అజామ్ వికెట్ పడిందని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో హార్దిక్ పాండ్యా కి చెందిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ తర్వాతి ఓవర్ లోనే కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఇమామ్ మిడ్ – ఆన్ వైపు షాట్ ఆడాడు.
Also Read: IND vs Pak: పాకిస్తాన్ ఓడిపోతే.. టీవీలు పగలకొట్టే వాడు ఎవడు లేడు..?
దీంతో వెంటనే అద్భుతమైన ఫుట్ వర్క్ తో బాల్ ని పట్టుకొని అక్షర పటేల్ ఇమామ్ ని రన్ అవుట్ చేశాడు. ఇమామ్ 26 బంతులలో పది పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ 47 పరుగుల వద్ద రెండవ వికెట్ ని కోల్పోయింది. ఇక ప్రస్తుతం 23 ఓవర్ల వద్ద 92 పరుగులు చేసి రెండు వికెట్లను కోల్పోయింది పాక్. ప్రస్తుతం క్రీజ్ లో షకీల్ {27*}, మహమ్మద్ రిజ్వాన్ {20*} ఉన్నారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) February 23, 2025