E-Paper
Advertisement

Temba Bavuma: 2007 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్ శర్మ ఆడేసరికి, నేను స్కూల్ కు వెళుతున్నా

Temba Bavuma: 2007 వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్ శర్మ ఆడేసరికి, నేను స్కూల్ కు వెళుతున్నా
Advertisement

Temba Bavuma:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ఫినిష్ కాగా, రేపు అంటే డిసెంబ‌ర్ 3వ తేదీన రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే జరిగింది. అయితే ఈ వన్డే నేపథ్యంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బ‌వుమా ( Temba Bavuma) కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఉద్దేశించి పొగుడుతూ మాట్లాడారు. ఆ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు టీమిండియా జ‌ట్టులో ఉండ‌టం చాలా అదృష్టం అన్నారు. దీంతో తెంబా బ‌వుమా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read:  Rohit Sharma: కోహ్లీ సెంచ‌రీ..గంభీర్ ను బండ బూతులు తిట్టిన రోహిత్‌…”తెరీ మా***” అంటూ

రోహిత్ శర్మ పై తెంబా బ‌వుమా కీలక వ్యాఖ్యలు

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd ODI) మధ్య రేపు రెండవ వన్డే జరగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మను ( rohit sharma ) ఉద్దేశించి దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బ‌వుమా కీలక వ్యాఖ్యలు చేశారు. నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు రోహిత్ శర్మ వరల్డ్ కప్ ఆడినట్లు పేర్కొన్నారు. 2007 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించాడు.. ఆ సమయంలో నేను ఇంకా కూడా స్కూలుకు వెళుతున్నాను అని తెంబా బ‌వుమా తెలిపారు. ఆ వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జ‌రిగిన‌ప్ప‌టికీ ప్రతి మ్యాచ్ టీవీలో మాత్రమే చూశానని వివరించాడు.

విరాట్ కోహ్లీతో ( Virat Kohli ) పాటు రోహిత్ శర్మ ( Rohit Sharma) ఇద్దరు అద్భుతమైన ఆటగాళ్లని కొనియాడాడు. ఆ ఇద్దరు ప్లేయర్లు టీమిండియాలో ఉంటే వాళ్లను ఓడించడం చాలా కష్టమన్నారు తెంబా బ‌వుమా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అనుభవం టీమిండియా జ‌ట్టుకు చాలా అవసరం అన్నారు. వాళ్లతో ఆడడం తనకు ఎక్సైటింగ్ గా ఉందని పేర్కొన్నారు తెంబా బ‌వుమా.

బుధవారం రోజున దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో వన్డే

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో మొదటి మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 17 పరుగుల తేడాతో మొదటి వన్డేను టీమిండియా గెలుచుకుంది. విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ అద్భుతంగా ప్రదర్శన కనబరిచారు. దీంతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఇండియా. కాగా బుధవారం రోజున అంటే డిసెంబర్ మూడవ తేదీన రాయిపూర్ వేదికగా రెండవ వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ప్రసారాలను చూడవచ్చు.

Also Read: IND VS SA 1st ODI: ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×