SRH VS PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… శనివారం రోజున రెండు మ్యాచ్లు జరగగా… హైదరాబాద్ మ్యాచ్ కూడా నిర్వహించారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో.. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల ( Punjab Kings vs Sunrisers Hyderabad Teams) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు పైన ఎనిమిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది హైదరాబాద్. హైదరాబాద్ బ్యాటర్లు అభిషేక్ శర్మ అలాగే ట్రావిస్ హెడ్ ఇద్దరు అద్భుతంగా ఆడటంతో జట్టు అవలీలగా గెలిచింది.
Also Read: SRH VS PBKS: SRH ఊచకోత… అభిషేక్ తెచ్చిన ఆ పేపర్ స్టోరీ ఇదే
ఆస్ట్రేలియా ప్లేయర్ల గొడవ
పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య నిన్న మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హైదరాబాద్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, పంజా బాటగాడు మ్యాక్స్ వెల్ ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. నిన్న భయంకరమైన బ్యాటింగ్ తో హెడ్ రెచ్చిపోయాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అభిషేక్ శర్మ అలాగే హెడ్ ఇద్దరు పోటాపోటీగా సిక్సులు అలాగే బౌండరీలు దంచుకున్నారు. దీంతో… సన్రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.
అయితే మ్యాచ్… మధ్యలో భీకరంగా బ్యాటింగ్ చేసిన హెడ్ కు బౌలింగ్ చేసేందుకు మ్యాక్సీ మామ వచ్చాడు. అయితే అతని బౌలింగ్లో హెడ్ భయంకరంగా ఆడటంతో.. సహనం కోల్పోయాడు మ్యాక్సీ మామ. ప్రత్యర్ధులను ఆస్ట్రేలియా టీం ఎలా స్లెడ్జింగ్ చేస్తుందో… అచ్చం అలాగే హెడ్ పైన చేశాడు మ్యాక్సీ మామ. దీంతో చిర్రెత్తిపోయిన హెడ్.. మాక్సిమామాతో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అంతలోనే అంపైర్ వచ్చి, పరిస్థితిని చక్కదిద్దాడు. అనంతరం.. పంజాబ్ ఆటగాడు స్టోయినోస్ కూడా వచ్చి… హెడ్ ను ఉద్దేశించి ఏదో అన్నాడు. దానికి కౌంటర్ గా…స్టోయినోస్ ను కొట్టిస్తా అన్నట్లుగా పై పైకి వెళ్ళాడు హెడ్. ఇలా ఆస్ట్రేలియా ప్లేయర్లు గొడవకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో నేటిజన్స్ చాలామంది… ట్రావిస్ హెడ్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అతడు సాధారణంగా గొడవ పెట్టుకోడని…. మాక్సిమామ కావాలని గెలిచాడని… అంటున్నారు.
అభిషేక్ శర్మ భయంకరమైన సెంచరీ
పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల ( Punjab Kings vs Sunrisers Hyderabad Teams) మధ్య జరిగిన మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ తో దుమ్ము లేపాడు కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసిన అభిషేక్ శర్మ… పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్గా 45 బంతుల్లో 141 పరుగులు చేశాడు అభిషేక్ శర్మ. ఇందులో 10 సిక్సర్లతో పాటు 14 బౌండరీలు ఉన్నాయి.
Also Read: ICC 2-Ball Rule: క్రికెట్‌లో కొత్త రూల్స్… ఇక ప్లేయర్స్ చుక్కలు చూడాల్సిందే
Fight between Travis Head, Maxwell & Stoinis in IPL.
IPL on peak
#SRHvsPBKS pic.twitter.com/LaiRMAExIC
— Hindutva Knight (@KinghtHindutva) April 12, 2025