BigTV English

Akkineni Heros : అక్కినేని ఫ్యాన్స్ రెడీ అవండమ్మా… మరో రూ. 100 కోట్లు పక్కా..!

Akkineni Heros : అక్కినేని ఫ్యాన్స్ రెడీ అవండమ్మా… మరో రూ. 100 కోట్లు పక్కా..!

Akkineni Heros : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఒక మార్కుంది. అక్కినేని నాగేశ్వరావు వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చిన నాగార్జున నాగచైతన్య, అఖిల్ అందరూ వరసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు వందకోట్ల క్లబ్లో చేరిన అక్కినేని సినిమాలు అంతగా లేవు. తాజాగా ఆ రికార్డు ని నాగచైతన్య బ్రేక్ చేశారు. రీసెంట్ గా ఆయన నటించిన తండేల్ మూవీతో ఆ రికార్డ్ ను అందుకున్నాడు. విడుదలైన వెంటనే ఆన్‌లైన్‌లో సినిమా లీక్ అయింది. అలా జరగకుండా ఉంటే కచ్చితంగా సినిమాకు మరింత భారీగా వసూళ్లు నమోదు అయ్యేవి. అక్కినేని ఫ్యాన్స్ కాలర్‌ ఎగురవేసుకునే రేంజ్‌లో తండేల్‌ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో చైతూ నటనకు అందరు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయం అంటూ అక్కినేని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


నాగ చైతన్య లైఫ్ కు టర్నింగ్ పాయింట్ తండేల్.. 

అక్కినేని ఫ్యామిలీకి ఈమధ్య సరైనా హిట్ సినిమా పడలేదు. చైతన్య రీసెంట్ గా తండేల్ మూవీతో బాక్సాఫీస్ వద్ద కోట్లు రాబట్టాడు. దీని తర్వాత చైతూ చేయబోతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే నాగ చైతన్య తదుపరి సినిమా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతోంది. ‘విరూపాక్ష’ సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించుకున్న కార్తీక్‌ వర్మ దండు ప్రస్తుతం నాగ చైతన్య కోసం విభిన్నమైన కమర్షియల్‌ థ్రిల్లర్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడట. అయితే ఈ సినిమా దాదాపు 6 నెలలు షూటింగ్ జరుపుకొనిందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే అంటే ఈ ఏడాది చివర్లో లేదా జనవరికి ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకప్ ప్లాన్ చేస్తున్నారట. తండేల్ మూవీలో గుబురు గడ్డం మాస్ లుక్ లో కనిపించిన నాగచైతన్య ఈ సినిమాలో కంప్లీట్ గా డిఫరెంట్ గా కనిపించబోతున్నారని తెలుస్తుంది.


Also Read : ఆ బాధతోనే తప్పుడు పని చేశా.. తాగుడుకు బానిసయ్యాను..

వంద కోట్ల టార్గెట్ తో నాగ చైతన్య.. 

ఈ మధ్య తండేల్‌ సినిమా తర్వాత నాగ చైతన్య సినిమా అనగానే మినిమం అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను రీచ్‌ అయితే కచ్చితంగా వంద కోట్ల క్లబ్‌లో మరోసారి చేరడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. విరూపాక్ష భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా నాగ చైతన్యకు అది కూడా కలిసి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుని ఉన్నారు. అన్ని పాజిటివ్‌ వైబ్స్ ఉన్న కారణంగా సినిమాకు కచ్చితంగా ఈ సినిమా కూడా కచ్చితంగా 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అక్కినేని అభిమానులు నమ్ముతున్నారు. వృషకర్మ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. థ్రిల్లర్‌, హర్రర్‌ కాన్సెప్ట్‌ ఈమధ్య సక్సెస్‌లను దక్కించుకుంటున్నాయి.. ఇక నాగచైతన్య కూడా ఇదే ఫార్ములాని ఫాలో అయ్యే అవకాశాలు. ఈ సినిమా ఇలాంటి జోనర్ లో వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా కూడా ఈ సినిమాపై టాలీవుడ్ లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×