BigTV English

SRH VS PBKS: SRH ఊచకోత… అభిషేక్ తెచ్చిన ఆ పేపర్ స్టోరీ ఇదే

SRH VS PBKS:  SRH ఊచకోత… అభిషేక్ తెచ్చిన ఆ పేపర్ స్టోరీ ఇదే

SRH VS PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో భాగంగా ఇవాళ అత్యంత కీలకమైన మ్యాచ్ జరిగింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో… అద్భుతంగా ఆడింది. చివరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది హైదరాబాద్. ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోరే చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని అవలీలగా చేదించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఏకంగా 245 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని… 8 వికెట్ల తేడాతో చేదించింది హైదరాబాద్. 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది SRH.


Also Read: Virat Kohli – Rahul Dravid : వీల్ చైర్ పై ద్రవిడ్… విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి

హెడ్, అభిషేక్ శర్మ ఊచకోత


పంజాబ్ జట్టు పైన ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ ఇద్దరు కూడా భయంకరమైన బ్యాటింగ్ తో రెచ్చిపోయారు. ఈ మ్యాచ్లో హెడ్ 37 బంతుల్లో 66 పరుగులు చేశాడు. కాస్త నెమ్మదిగా ఆడిన హెడ్ మూడు సిక్సర్లు అలాగే తొమ్మిది బౌండరీలు బాదాడు. అలాగే అభిషేక్ శర్మ 55 బంతుల్లోనే ఏకంగా 141 పరుగులు చేశాడు. ఇందులో 10 సిక్సర్లతో పాటు 14 బౌండరీలు ఉన్నాయి. 256 స్ట్రైక్ రేటుతో దుమ్ము లేపాడు అభిషేక్ శర్మ.

అభిషేక్ శర్మ చూపించిన పేపర్ లో ఏముందంటే ?

సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ఇవాళ సెంచరీ తో రెచ్చిపోయాడు. అయితే… సెంచరీ చేసిన అనంతరం.. అభిషేక్ శర్మ చేసిన సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పంజాబ్ కింగ్స్ పైన సెంచరీ పూర్తి చేయగానే తన జేబులోని ఓ పేపర్ ను బయటకు తీశాడు అభిషేక్ శర్మ. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఆ కాగితాన్ని చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక అందులో… తన సెంచరీ ఆరెంజ్ ఆర్మీకి మాత్రమే అంకితం అంటూ… ఇంగ్లీషులో రాసుకోచ్చాడు. ఇక దాన్ని చూపిస్తూ… సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. గత ఐదు మ్యాచ్లలో పెద్దగా స్కోర్ చేయని అభిషేక్ శర్మ పైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అటు హైదరాబాద్ జట్టు పైన కూడా అభిమానులు చాలా సీరియస్ అవుతూనే ఉన్నారు. అందుకే ఫ్యాన్స్ ను ఆకట్టుకునేందుకు… అభిషేక్ శర్మ భయంకరమైన ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు.

Also Read: Lionel Messi: మెస్సి బాడీగార్డ్ ను చూసారా… వాడు పెద్ద రాక్షసుడు

కావ్య పాపా ఫుల్ హ్యాపీ

సన్రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ అలాగే హెడ్ ఇద్దరు అద్భుతంగా ఆడి మ్యాచ్ను విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ సెంచరీ చేయడంతో… కావ్య పాప ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అభిషేక్ శర్మ సెంచరీ చేసిన తర్వాత… స్టేడియంలో ఉన్న అతని పేరెంట్స్ కు హగ్ ఇచ్చి సెలబ్రేట్ చేసుకుంది కావ్య పాప. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×